Share News

Tollywood Drugs Case: టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో కీలక మలుపు

ABN , Publish Date - Feb 01 , 2024 | 05:12 PM

Telangana: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. 2018లో నమోదైన డ్రగ్స్ కేసులకు సంబంధించి నాంపల్లి కోర్టులో ఎక్సైజ్‌ శాఖకు ఎదురుదెబ్బ తగిలింది.

Tollywood Drugs Case: టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో కీలక మలుపు

హైదరాబాద్, ఫిబ్రవరి1: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో (Tollywood Drugs Case) కీలక మలుపు చోటు చేసుకుంది. 2018లో నమోదైన డ్రగ్స్ కేసులకు సంబంధించి నాంపల్లి కోర్టులో ఎక్సైజ్‌ శాఖకు ఎదురుదెబ్బ తగిలింది. టాలీవుడ్‌ నటులపై నమోదయిన 8 కేసుల్లో 6 కేసులను కోర్టు కొట్టివేసింది. టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసుపై గత ప్రభుత్వం ప్రత్యేక సిట్‌ ఏర్పాటు చేసింది. టాలీవుడ్ డ్రగ్స్‌పై మొత్తం 8 కేసులను సిట్ నమోదు చేసింది. అయితే 8 కేసుల్లో ఆరు కేసులను కోర్టు కొట్టివేసింది. సరైన ఆధారాలు, సాక్ష్యాలు లేకపోవడంతో ఈ కేసులను నాంపల్లి కోర్టు తోసిపుచ్చింది. డ్రగ్స్‌ కేసులో పాటించాల్సిన ప్రొసీజర్‌ ఫాలో కాకపోవటంతో ఎక్సైజ్‌ శాఖకు ఎదురు దెబ్బ తగిలింది. ఆరు కేసుల్లో ఎలాంటి సాక్ష్యాలు, ఆధారాలు లేవని కోర్టు కొట్టివేసింది.


ఈ కేసులకు సంబంధించి నెలల తరబడి టాలీవుడ్‌ నటులను ఎక్సైజ్ శాఖ విచారించిన విషయం తెలిసిందే. నటీనటుల దగ్గర నుంచి గోళ్లు, వెంట్రుకలు శాంపిళ్లను ఎక్సైజ్ శాఖ తీసుకుని.. ఆ శాంపిల్స్‌ను ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించింది. అయితే డైరెక్టర్ పూరీ జగన్నాథ్, నటుడు తరుణ్‌ల శాంపిల్స్‌‌ను మాత్రమే ఎఫ్‌ఎస్‌ఎల్‌ పరిశీలించింది. పూరీ, తరుణ్‌ల శరీరంలో డ్రగ్స్‌ ఆనవాళ్లు లభించలేదని ఎఫ్‌ఎఎస్‌ఎల్‌ తేల్చిచెప్పింది. దీంతో ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక, సాక్ష్యాలను చూసిన నాంపల్లి కోర్టు కేసులను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 01 , 2024 | 05:20 PM