Share News

TS News: షాకింగ్ న్యూస్.. హైదరాబాద్‌లో రూ.9 కోట్లు విలువైన డ్రగ్స్ పట్టివేత

ABN , Publish Date - Mar 22 , 2024 | 12:20 PM

Telangana: ఇటీవల కాలంలో నిషేధిత డ్రగ్స్‌ సరఫరాపై డ్రంగ్ కంట్రోల్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. నగరంలో పలు చోట్ల తనిఖీలు చేసిన అధికారులు నకిలీ మందులు తయారు చేస్తూ విక్రయిస్తున్న గోడౌన్‌లపై దాడులు నిర్వహించి మందులను సీజ్ చేస్తున్నారు. తాజాగా నిషేధిత డ్రగ్స్ తయారు చేస్తున్న కంపెనీపై డ్రంగ్ కంట్రోల్ అధికారులు దాడులు చేశారు. హైదరాబాద్‌ శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు 9 కోట్ల రూపాయల విలువు చేసే డ్రగ్స్‌ను డ్రగ్ కంట్రోల్ అధికారులు స్వాధీనం పరుచుకున్నారు.

TS News: షాకింగ్ న్యూస్.. హైదరాబాద్‌లో రూ.9 కోట్లు విలువైన డ్రగ్స్ పట్టివేత

హైదరాబాద్, మార్చి 22: ఇటీవల కాలంలో నిషేధిత డ్రగ్స్‌ సరఫరాపై డ్రంగ్ కంట్రోల్ అధికారులు (Drug Control Officers(DCA)) ఉక్కుపాదం మోపుతున్నారు. నగరంలో (Hyderabad) పలు చోట్ల తనిఖీలు చేసిన అధికారులు నకిలీ మందులు తయారు చేస్తూ విక్రయిస్తున్న గోడౌన్‌లపై దాడులు నిర్వహించి మందులను సీజ్ చేస్తున్నారు. తాజాగా నిషేధిత డ్రగ్స్ తయారు చేస్తున్న కంపెనీపై డ్రంగ్ కంట్రోల్ అధికారులు దాడులు చేశారు. హైదరాబాద్‌ శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు 9 కోట్ల రూపాయల విలువు చేసే డ్రగ్స్‌ను డ్రగ్ కంట్రోల్ అధికారులు స్వాధీనం పరుచుకున్నారు.

TDP Third List: టీడీపీ మూడో జాబితా విడుదల.. టికెట్ దక్కిన నేతలు వీరే..

బొల్లారంలోని ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారు చేస్తున్నట్లుగా ఇంటర్ పోల్ సమాచారం అందింది. వెంటనే ఇంటర్ పోల్ సహాయంతో పీఎస్‌ఎన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో డ్రగ్ కంట్రోల్ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ క్రమంలో కంపెనీలో నిషేధిత డ్రగ్స్ తయారు చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. దాదాపు 90 కిలోల మెపీడ్రిన్ డ్రగ్స్‌ను డ్రగ్ కంట్రోల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత పది సంవత్సరాల నుంచి డ్రగ్స్ తయారు చేసి విదేశాలకి తరలిస్తున్న కస్తూరి రెడ్డి నల్లపొడిని అరెస్ట్ చేశారు. సిగరెట్ ప్యాకెట్లలో డ్రగ్స్‌ను పెట్టి విదేశాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు. కొంత వరకు హైదరాబాదులో కూడా డ్రగ్స్ సప్లై చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డ్రగ్స్ పట్టుబడటంపై డ్రగ్ కంట్రోల్ అధికారి కమలహాసన్ రెడ్డి మాట్లాడుతూ.. ఇంటర్ పోల్ సహాయంతో డ్రగ్స్ రాకెట్టు గుట్టురట్టు చేశామని తెలిపారు. పీఎస్‌ఎన్ కంపెనీ పలు దేశాలకు డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నట్లుగా సమాచారం ఉందని కమలహాసన్ రెడ్డి వెల్లడించారు.

ఇవి కూడా చదవండి..

Hyderabad: బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన సీనియర్ నేత..

Big Breaking: సుప్రీంలో కవితకు ఎదురుదెబ్బ

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 22 , 2024 | 12:42 PM