Share News

Hyderabad: బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన సీనియర్ నేత..

ABN , Publish Date - Mar 22 , 2024 | 11:20 AM

హస్తినాపురం డివిజన్‌ కార్పొరేటర్‌ (బీఆర్‌ఎస్‌) బానోతు సుజాతానాయక్‌(Banothu Sujathanayak) గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

Hyderabad: బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన సీనియర్ నేత..

హైదరాబాద్: హస్తినాపురం డివిజన్‌ కార్పొరేటర్‌ (బీఆర్‌ఎస్‌) బానోతు సుజాతానాయక్‌(Banothu Sujathanayak) గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జీ దీపాదాస్‌ మున్షీ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు(Ponguleti Srinivas Reddy, Tummala Nageswar Rao) సమక్షంలో ఆమె కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. కర్మన్‌ఘాట్‌ హనుమాన్‌ దేవస్థానం మాజీ చైర్మన్‌ ఈశ్వరమ్మయాదవ్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌, రాష్ట్ర రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ మల్‌రెడ్డి రాంరెడ్డి, జీహెచ్‌ఎంసీ కాంగ్రెస్‌ పార్టీ ఫ్లోర్‌ లీడర్‌, లింగోజిగూడ డివిజన్‌ కార్పొరేటర్‌ దర్పల్లి రాజశేఖర్‌ రెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - Mar 22 , 2024 | 11:20 AM