Share News

Medical Shops: మెడికల్ షాపుల్లో దాడులు.. అధికారులకు దిమ్మతిరిగే షాక్

ABN , Publish Date - Nov 13 , 2024 | 10:48 AM

Telangana: రాష్ట్ర వ్యాప్తంగా 21,639 చోట్ల డ్రగ్స్ స్టేట్ విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 346 మెడికల్ షాప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్‌పై స్టేట్ కంట్రోల్ అధికారులు యాక్షన్ తీసుకున్నారు. సూర్యాపేటలోని ఎర్ర పహాడ్‌లో ఇల్లీగల్‌గా నడిపిస్తున్న మెడికల్ షాప్‌ను డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులు సీజ్ చేశారు.

Medical Shops: మెడికల్ షాపుల్లో దాడులు.. అధికారులకు దిమ్మతిరిగే షాక్
Telangana Drugs Control Officials

హైదరాబాద్, నవంబర్ 13: రాష్ట్రంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అథారిటీ అధికారులు (Telangana Drugs Control officials) బుధవారం ఉదయం మెరుపు దాడులు చేపట్టారు. మెడిసిన్స్ ఎక్కువ ధరకు అమ్ముతున్న మెడికల్ షాప్స్‌పై అధికారులు తనిఖీలు నిర్వహించారు. లైసెన్స్ లేకుండా మెడికల్ షాప్స్ నడిపిస్తున్న వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కామారెడ్డి, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. అనుమతులు లేని డ్రగ్స్‌ను ఆయుర్వేద రూపంలో రోగులకు మెడికల్ షాప్ యాజమానులు విక్రయిస్తున్న వైనాన్ని అధికారులు గుర్తించారు. షాపుల్లో దాడులు చేస్తున్న అధికారులకు షాకింగ్ విషయాలను కనుగొన్నారు.

CM Revanth Reddy: కేసీఆర్‌కు నేను ఫైనాన్స్ చేశా.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు


హై బ్లడ్ ప్రెషర్ కోసం నార్కోటిక్ టాబ్లెట్స్, కిడ్నీ స్టోన్స్ కోసం ధవ సిరప్, డయాబెటిస్ కోసం డికో టాబ్లెట్స్ లాంటి స్టెరాయిడ్స్‌ను డాక్టర్ ప్రెస్కిప్షన్ లేకుండా మెడికల్ షాప్‌ నిర్వాహకులు విక్రయిస్తున్నట్లు తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు కనిపెట్టారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 21,639 చోట్ల డ్రగ్స్ స్టేట్ విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 346 మెడికల్ షాప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్‌పై స్టేట్ కంట్రోల్ అధికారులు యాక్షన్ తీసుకున్నారు. సూర్యాపేటలోని ఎర్ర పహాడ్‌లో ఇల్లీగల్‌గా నడిపిస్తున్న మెడికల్ షాప్‌ను డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులు సీజ్ చేశారు. అలాగే భూదాన్ పోచంపల్లి దేశ్ముఖి విలేజ్‌లో ఆర్‌ఎంపీ దగ్గర 30 రకాల నకిలీ మందులను సీజ్ చేశారు.

పెద్దిరెడ్డి చెప్పారని కట్టబెట్టారు!


మంత్రి ఆదేశాల మేరకు..

నకిలీ మెడిసిన్స్ తయారు చేసే వారిపై వాటిని అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఇటీవలే ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. మెడికల్ షాప్స్‌తో పాటు ఫార్మా ఇండస్ట్రీస్ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మెడికల్ హాల్స్‌లో విస్తృతంగా తనిఖీలు చేయాలని మంత్రి సూచించారు. అవసరమైతే అదనపు డ్రగ్ ఇన్స్పెక్టర్లను నియమించుకొని ప్రజల ప్రాణాలతో చెలగాటమారుతున్న వారిపై ఉక్కు పాదం మోపాలని మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. మంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు విస్తృతంగా దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో అనేక షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. మరికొన్ని ప్రాంతాల్లో కూడా దాడులు కొనసాగుతాయని వారు చెప్పారు. అనుమతులు లేని డ్రగ్స్‌ను విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని డ్రగ్స్ కంట్రోల్ అధికారులు స్పష్టం చేశారు. అధికారుల దాడులతో నిబంధనలకు విరుద్ధంగా మెడికల్ షాపులు నిర్వహిస్తున్న నిర్వాహకుల్లో వణుకుమొదలైంది.


ఇవి కూడా చదవండి...

అమరావతికి అందలం

AP News: వైసీపీ @ అరాచకం

Read Latest Telangana News ANd Telugu News

Updated Date - Nov 13 , 2024 | 10:50 AM