Share News

Arvind: దేశంలో మరోసారి బీజేపీ ప్రభంజనం ఖాయం

ABN , Publish Date - Feb 12 , 2024 | 03:29 PM

దేశంలో మరోసారి బీజేపీ ప్రభంజనం ఖాయమని ఎంపీ ధర్మపురి అరవింద్ (Dharmapuri Arvind ) అన్నారు. సోమవారం బోధన్‌లో గోశాలను సందర్శించారు. దేశ సంస్కృతి సాంప్రదాయాలను బీజేపీ ప్రభుత్వం కాపాడుతోందని చెప్పారు.

 Arvind: దేశంలో మరోసారి బీజేపీ ప్రభంజనం ఖాయం

నిజామాబాద్ జిల్లా: దేశంలో మరోసారి బీజేపీ ప్రభంజనం ఖాయమని ఎంపీ ధర్మపురి అరవింద్ (Dharmapuri Arvind ) అన్నారు. సోమవారం బోధన్‌లో గోశాలను సందర్శించారు. ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ... దేశ సంస్కృతి సాంప్రదాయాలను బీజేపీ ప్రభుత్వం కాపాడుతోందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని తెలిపారు. గతంలో మందిరాల్లో మసీదులు, దర్గాలను నిర్మించిన పట్టించుకోలేదన్నారు. సెక్యులర్ పార్టీల వల్ల హిందూ సమాజం ఇబ్బంది పడిందని అన్నారు.

హిందూ సంప్రదాయాన్ని కాంగ్రెస్ తొక్కి పెట్టడంతో దేశంలో ఆ పార్టీ కనుమరుగయిందని చెప్పారు. 500 ఏళ్ల ప్రజల ఆకాంక్షలను మోదీ ప్రభుత్వం నెరవేర్చిందని అన్నారు. అయోధ్య రామాలయం దేశ ప్రజల చిరకాల కోరికను బీజేపీ సాధించిందని చెప్పారు. సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. హిందూ సాంప్రదాయాన్ని కాపాడకపోతే తీవ్ర నష్టం ఎదుర్కోవాల్సి వస్తుందని ఎంపీ ధర్మపురి అరవింద్ హెచ్చరించారు.

Updated Date - Feb 12 , 2024 | 03:50 PM