Share News

TS NEWS: ఫార్ములా ఈ-రేస్‌ రద్దుపై కాంగ్రెస్ నేత ఏమన్నారంటే..?

ABN , Publish Date - Jan 09 , 2024 | 04:22 PM

ఫార్ములా ఈ-రేస్ ( Formula E-Race ) వల్ల ట్రాఫిక్ సమస్యలు తప్ప పైసా ఉపయోగం లేదని టీపీసీసీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్‌రెడ్డి ( Sama Rammohan Reddy ) తెలిపారు.

TS NEWS: ఫార్ములా ఈ-రేస్‌ రద్దుపై కాంగ్రెస్ నేత ఏమన్నారంటే..?

హైదరాబాద్: ఫార్ములా ఈ-రేస్ ( Formula E-Race ) వల్ల ట్రాఫిక్ సమస్యలు తప్ప పైసా ఉపయోగం లేదని టీపీసీసీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్‌రెడ్డి ( Sama Rammohan Reddy ) తెలిపారు. మంగళవారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... గత బీఆర్ఎస్ ప్రభుత్వం నగరంలో ఫార్ములా ఈ-రేస్ పెట్టి ప్రజాధనం వృథా చేసిందని చెప్పారు. హెచ్ఎండీఏ నుంచి రూ.55 కోట్లు బదిలీ ఎలా జరిగింది అని ప్రశ్నించారు. ప్రభుత్వం అనుమతి లేకుండా ఇండివిజ్యువల్‌ అగ్రిమెంట్‌ ఎలా చేస్తారని నిలదీశారు. ఫార్ములా ఈ-రేస్‌లో పాత్రధారుడు అరవింద్‌కుమార్‌, సూత్రదారుడు కేటీఆర్‌ అని చెప్పారు. ఫార్ములా ఈ-రేస్‌ని రద్దు చేస్తే స్పందించిన కేటీఆర్.. మెమో జారీ చేస్తే ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ప్రజాపాలన దరఖాస్తులను సిస్టమ్‌లో అప్‌డేట్‌ చేసే ప్రక్రియ జరుగుతోందని సామ రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 09 , 2024 | 04:32 PM