Share News

CM Revanth Reddy: తెలంగాణ వైద్యరంగంలో పెట్టుబడులకు పెరుగుతున్న ఆసక్తి..

ABN , Publish Date - Feb 27 , 2024 | 01:59 PM

సీఎం రేవంత్‌ రెడ్డితో వెస్ట్రన్ ఆస్ట్రేలియా మంత్రి సాండర్సన్ సమావేశమయ్యారు. అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ వైద్య రంగంలో పెట్టుబడులకు వివిధ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నారని పేర్కొన్నారు. హెల్త్ కేర్, హెల్త్ టూరిజం, హెల్త్ స్కిల్లింగ్‌లో పెట్టుబడులకు అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. స్కిల్ క్యాపిటల్‌గా హైదరాబాద్ మారబోతోందన్నారు.

CM Revanth Reddy: తెలంగాణ వైద్యరంగంలో పెట్టుబడులకు పెరుగుతున్న ఆసక్తి..

హైదరాబాద్: సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy)తో వెస్ట్రన్ ఆస్ట్రేలియా మంత్రి సాండర్సన్ సమావేశమయ్యారు. అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ వైద్య రంగంలో పెట్టుబడులకు వివిధ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నారని పేర్కొన్నారు. హెల్త్ కేర్ (Health Care), హెల్త్ టూరిజం, హెల్త్ స్కిల్లింగ్‌లో పెట్టుబడులకు అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. స్కిల్ క్యాపిటల్‌ (Skill capital)గా హైదరాబాద్ మారబోతోందన్నారు. జిల్లా ఆసుపత్రులను మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులుగా తీర్చిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ చొరవతోనే హైదరాబాద్ లో ఫార్మా కంపెనీలు వచ్చాయని రేవంత్ గుర్తు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 27 , 2024 | 01:59 PM