Share News

తొలిసారి సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి..!

ABN , Publish Date - May 25 , 2024 | 05:23 PM

రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌(Command Control Center)ను సందర్శించనున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు ఆయన మరికాసేపట్లో రానున్నారు. సెంటర్‌లో అధికారుల విధులు, ఇతర అంశాలపై సమీక్షించనున్నట్లు సమాచారం. నార్కోటిక్స్ బ్యూరో(Bureau of Narcotics) పనితీరు, పలు అంశాలపైనా సీఎం రేవంత్ ఆరా తీయనున్నారు.

తొలిసారి సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి..!
CM Revanth Reddy

హైదరాబాద్ మే 25: రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌(Command Control Center)ను సందర్శించనున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు ఆయన మరికాసేపట్లో రానున్నారు. సెంటర్‌లో అధికారుల విధులు, ఇతర అంశాలపై సమీక్షించనున్నట్లు సమాచారం. నార్కోటిక్స్ బ్యూరో(Bureau of Narcotics) పనితీరు, పలు అంశాలపైనా సీఎం రేవంత్ ఆరా తీయనున్నారు.


కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నార్కోటిక్స్ బ్యూరోకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించారు. తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలనకు తీసుకోవాల్సిన అంశాలపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించనున్నారు. రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్‌లో గంజాయి, డ్రగ్స్ వంటి మత్తుపదార్థాల బారిన యువత పడకుండా తగిన చర్యలు తీసుకోవడంపై చర్చించనున్నారు. తాజాగా బెంగళూరు శివారులో తెలుగు నటులు మత్తు పదార్థాలు వినియోగించి రేవ్ పార్టీలో పట్టుపడడంతో ఈ సమావేశంపై ఆసక్తి నెలకొంది. డ్రగ్స్ నిర్మూలనకు సీఎం ఎలాంటి చర్యలు చేపట్టనున్నారో వేచి చూడాల్సిందే..

ఇవి కూడా చదవండి:

మావోయిస్టు డంప్‌లో ఏ లభించాయంటే..?

Vallabhaneni Vamsi: ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఉరికించిన టీడీపీ యువత.. మామూలుగా లేదుగా!

Updated Date - May 25 , 2024 | 05:48 PM