Share News

Ramoji Rao Passes Away: అక్షర యోధుడు రామోజీకి అశ్రునివాళి

ABN , First Publish Date - Jun 08 , 2024 | 12:26 PM

Ramoji Rao Passed Away: ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన.. శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ నెల 5వ తేదీన ఆయన శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఎదురవడంతో..

Ramoji Rao Passes Away: అక్షర యోధుడు రామోజీకి అశ్రునివాళి
Ramoji Rao Passed Away Live update

Live News & Update

  • Jun 08, 2024 20:45 IST

    గొప్ప వ్యక్తిని కోల్పోయాం!

    • రామోజీరావుకు నివాళులు అర్పించిన కిషన్ రెడ్డి

    • తెలుగు ప్రజలు ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయారన్న టి.బీజేపీ అధ్యక్షుడు

    • మీడియా రంగంలో రామోజీరావు నూతన ఒరవడిని సృష్టించారు

    • తెలుగు భాష గురించి ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు

    • ఆయన తీర్చిదిద్దిన అనేక మంది జర్నలిస్టులు తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు

    • రాజ్యసభలో చోటు కల్పిస్తామని చెప్పినా సున్నితంగా తిరస్కరించారు

    • ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి

    • రెండ్రోజులుగా ఢిల్లీలో బిజిబిజీగా ఉన్న కిషన్ రెడ్డి

    • రామోజీ ఇకలేరన్న వార్త తెలుసుకుని హైదరాబాద్‌కు పయనం

    • ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా రామోజీ ఫిల్మ్ సిటికి వెళ్లిన కిషన్ రెడ్డి

    • కిషన్ రెడ్డి వెంట తెలంగాణ బీజేపీ నేతలు

    Kishan-Reddy.jpg

  • Jun 08, 2024 20:30 IST

    తెలుగు వారికి ఇదొక పెద్ద విషాదం..!

    • రామోజీరావు మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందన

    • తెలుగు వారికి ఇదొక పెద్ద విషాదమన్న ప్రధాని

    • కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ద్వారా సందేశం

    • రామోజీ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలపమన్న మోదీ

    • రెండ్రోజుల కిందట రామోజీ ఆరోగ్యంపై మోదీ ఆరా

    • రామోజీరావు ప్రజలకు చేసిన సేవలేంటో ప్రధానికి తెలుసన్న నిర్మలా

    • రామోజీ కుటుంబ సభ్యులతో ఐదు నిమిషాలపాటు చర్చించిన కేంద్ర మంత్రి

    • ట్విట్టర్ వేదికగా కూడా ఈ విషయంపై స్పందించిన నిర్మలా సీతారామన్

    Nirmala-Sitha-Raman.jpg

  • Jun 08, 2024 20:00 IST

    రామోజీ మృతికి ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా తీవ్ర దిగ్భ్రాంతి

    edg.jpg

    • రామోజీ గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావు మృతికి ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

    • ఆయన మార్గనిర్దేశకుడని కొనియాడింది. ఈమేరకు ప్రకటన విడుదల చేసింది.

    • రామోజీరావు (Ramoji Rao) మరణం విచారకరం.

    • మీడియా మెఘల్‌గా ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిన రామోజీరావు ఎన్నో మార్గాల్లో మనందరికీ మార్గనిర్దేశకులు.

    • నిజాన్ని నిర్భయంగా మాట్లాడే గొప్ప వ్యక్తి. ఆయనో ఐకాన్‌.

    • మీడియా రంగానికి ఆయన చేసిన కృషి.. దేశవ్యాప్తంగా జర్నలిస్టులందరిలో నిరంతరం స్ఫూర్తి కలిగిస్తుందని ఎడిటర్స్‌ గిల్డ్‌ తమ ప్రకటనలో తెలిపింది.

    • కాగా 1987లో రామోజీరావు ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియాకు ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు.

    • పత్రికాస్వేచ్ఛ అణచివేతకు అప్పటి ప్రభుత్వం చేసిన ప్రయత్నాల్ని వ్యతిరేకిస్తూ ఉద్యమించడంలో కీలకపాత్ర పోషించారు.

  • Jun 08, 2024 19:20 IST

    భారతీయ సినిమాకు తీరని లోటు: కమల్ హాసన్

    kamal.jpg

    • భారతీయ మీడియా మరియు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీరావు మరణవార్త తెలిసి చాలా బాధపడ్డానని ప్రముఖ నటులు కమల్ హాసన్ పేర్కొన్నారు.

    • రామోజీ రావు ఫిల్మ్ సిటీ తన క్రాఫ్ట్ గౌరవార్థం అంకితం చేయబడింది.

    • ఇది షూటింగ్ లొకేషన్ మాత్రమే కాదు, ప్రముఖ పర్యాటక కేంద్రం కూడా.

    • ఈ దూరదృష్టి,వినూత్న ఆలోచనాపరుడు మరణించడం భారతీయ సినిమాకు తీరని లోటు.

    • ఆయన కుటుంబసభ్యులకు, ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతి.

  • Jun 08, 2024 19:10 IST

    రామోజీని స్ఫూర్తిగా తీసుకొని నేను ఎదిగాను: బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి

    val.jpg

    • ఈనాడు అధిపతి రామోజీరావు మరణం తెలుగు ప్రజలకు తీరని లోటని ఆదోని బీజేపీ ఎమ్మెల్యే వాల్మీకి పార్థసారథి తెలిపారు.

    • రామోజీరావు అకాలమరణం దిగ్భ్రాంతి కలిగిస్తుంది.

    • రామోజీరావుకు పద్మవిభూషణ్ వచ్చినప్పుడు నేను వారి దగ్గరకు వెళ్లి మరీ శుభాకాంక్షలు చెప్పాను.

    • ఆయనను ష్ఫూర్తిగా తీసుకొని నేను ఎదిగాను.

    • రామోజీరావు అనే ఒక బ్రాండ్‌ను కోల్పోవడం బాధాకరం

    • రామోజీరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను.

  • Jun 08, 2024 18:55 IST

    భట్టి విక్రమార్క నివాళి

    batti.jpg

    • ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీరావు పార్ధివదేహానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నివాళులర్పించారు.

    • రామోజీరావు మరణం దేశానికి తీరని లోటు.

    • మీడియా రంగంలో రారాజులా వేలాది మందికి ఉపాధి కల్పించారు.

    పత్రికారంగంలో రామోజీ పెను సంచలనం: ఏఐసీసీ సభ్యులు నరహరి శెట్టి నరసింహారావు

    • ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీ రావు మరణం పట్ల ఏఐసీసీ సభ్యులు నరహరిశెట్టి నరసింహారావు సంతాపం ప్రకటించారు.

    • రైతు బిడ్డగా పుట్టి అంచెలు అంచెలుగా ఎదిగారు.

    • భారతీయ పత్రికారంగంలో రామోజీరావు పెను సంచలనం సృష్టించారు.

    • పలు రంగాల్లో వ్యాపారవేత్తగా, మీడియా సంస్థల వ్యస్థాపకుడిగా వారందించిన సేవలు మరువలేనివి.

    • వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి

  • Jun 08, 2024 18:30 IST

    కలుద్దామనుకున్నా.. ఇంతలోనే..!

    • రామోజీరావుకు నివాళులర్పించిన పవన్‌, త్రివిక్రమ్‌

    • రామోజీరావు మృతి దిగ్బ్రాంతి కలిగించింది

    • ప్రమాణస్వీకారం తర్వాత వచ్చి కలుద్దామనుకున్నా

    • ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి అండగా నిలబడ్డారు

    • వేలాది మంది జర్నలిస్టులను రామోజీరావు అందించారు

    • ఆయన కుటుంబానికి భగవంతుడు అండగా ఉండాలి

    • జనసేన తరపున సంతాపం తెలియజేస్తున్నా: పవన్‌ కల్యాణ్‌

    Pawan-Kalyan.jpg

  • Jun 08, 2024 18:29 IST

    రెండ్రోజులు సంతాప దినాలు!

    • ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావుకు ఏపీ ప్రభుత్వం ఘన నివాళి..

    • రామోజీ మృ‌తికి సంతాపం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ

    • జూన్-09, 10 తేదీలను సంతాప దినాలుగా ప్రకటిస్తూ ఆదేశాలు జారీ

    • శనివారం సాయంత్రం ఆదేశాలిచ్చిన సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్

    • రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు జాతీయ పతాకాన్ని సగం వరకూ అవనతం చేయాలని సూచన

    • అధికారికంగా ఏ వేడుకలు నిర్వహించరాదని పేర్కొంటూ సురేష్ ఉత్తర్వులు

  • Jun 08, 2024 17:17 IST

    రామోజీరావు పార్థీవదేహానికి నివాళులర్పించిన పవన్..

    జనసేన అధినేత పవన్ కల్యాణ్ రామోజీరావు పార్థీవదేహానికి నివాళులర్పించారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన ఆయన.. ఫిలింసిటీకి వెళ్లి అక్కడ రామోజీ పార్థీవదేహాన్ని సందర్శించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు.

  • Jun 08, 2024 17:14 IST

    ఢిల్లీ: రామోజీరావు మృతికి సంతాపం తెలిపిన బీజేపీ ఎంపీలు లక్ష్మణ్, ఈటల రాజేందర్

    ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీరావు మృతిపట్ల బీజేపీ ఎంపీలు లక్ష్మణ్, ఈటల రాజేందర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఏపీ భవన్‌లో ఈనాడు అధినేత రామోజీరావు చిత్రపటానికి ఎంపీలు లక్ష్మణ్, ఈటల రాజేందర్ నివాళులర్పించారు.

  • Jun 08, 2024 17:09 IST

    రామోజీరావు కీర్తి అజరామరం: నిమ్మల రామానాయుడు

    • ప్రపంచ దేశాల్లో ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కీర్తి అజరామరం.

    • రామోజీరావు మరణం దేశానికి తీరని లోటు.

    • మీడియా రంగంలో రారాజులా వేలాది మంది ఉపాధి కల్పించిన యోధుడు.

    • ఆయన వివిధ పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాను.

  • Jun 08, 2024 17:05 IST

    రామోజీరావు మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చేగొండి హరిరామ జోగయ్య

    • రామోజీరావు మరణం నాకు తీవ్ర దిగ్భ్రాంతిని కలగజేసింది.

    • ఆయనతో కలిసి నేను నిర్మాతగా ఉంటూ అనేక సినిమాలు, సీరియల్స్ నిర్మించాను.

    • రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ సమయంలో ఆయన అందించిన సహకారం మరువలేనిది.

    • ఆయన మరణం పత్రికా రంగానికి, నైతిక విలువలకు తీరని లోటు.

  • Jun 08, 2024 17:00 IST

    రామోజీ పార్ధివ దేహానికి నివాళులర్పించిన నిర్మలా సీతారామన్..

    కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి నిర్మలా సీతారామన్ రామోజీఫిలింసిటీకి వచ్చారు. రామోజీరావు పార్థీవ దేహానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. గొప్ప వ్యక్తిని కోల్పోయామని అన్నారు నిర్మలా సీతారామన్.

  • Jun 08, 2024 16:27 IST

    రామోజీరావు మరణం చాలా బాధాకరం: కేఏ పాల్

    • ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు గారు మరణం చాలా బాధాకరం.

    • ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను.

    • ఆయన కుటుంబ సభ్యులకు, బంధువులకు అందరికీ సంతాపం తెలియజేస్తున్నాను.

    • 25 ఏళ్ల క్రితం ఈటివిలో శాంతి సందేశం అనే కార్యక్రమం ద్వారా ప్రజల ముందుకు వచ్చాను.

  • Jun 08, 2024 15:58 IST

    ఆదివారం రామోజీరావు అంత్యక్రియలు..

    రామోజీరావు అంత్యక్రియలు ఆదివారం నిర్వహించనున్నారు. ఉదయం 9 - 10 గంటల మద్య అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఇందుకు తగ్గట్లుగా ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ఫిలింసిటీలోని ఆయన నివాసంలో రామోజీరావు పార్థీవ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు రామోజీ ఫిల్మ్ సిటీకి చేరుకుని.. రామోజీరావు పార్థీవదేహానికి నివాళులర్పిస్తున్నారు.

  • Jun 08, 2024 15:51 IST

    రామోజీరావుకు చిరంజీవి నివాళులు..

    • రామోజీ ఫిలిం సిటీ చేరుకున్న చిరంజీవి

    • రామోజీరావు పార్థివదేహానికి చిరంజీవి నివాళులు

  • Jun 08, 2024 15:22 IST

    కన్నీళ్లు పెట్టుకున్న నారా భువనేశ్వరి..

    రామోజీ పిల్మ్ సిటీలో రామోజీరావు పార్ధీవ దేహానికి నారా భువనేశ్వరి నివాళురల్పించారు. ఈ సందర్భంగా ఆమె భావోద్వేగానికి గురయ్యారు.

  • Jun 08, 2024 14:59 IST

    రామోజీరావు కుటుంబ సభ్యుల్ని ఓదార్చిన చంద్రబాబు నాయుడు దంపతులు

    • రామోజీ ఫిలిం సిటీ చేరుకున్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు.. రామోజీరావు పార్థివ దేహానికి నివాళులర్పించారు.

    • నారా భువనేశ్వరి కూడా రామోజీరావు పార్థీవదేహానికి నివాళులర్పించారు.

    • చంద్రబాబు నాయుడు దంపతులు రామోజీరావు కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు.

  • Jun 08, 2024 14:43 IST

    ఒక లెజెండ్‌ను కోల్పోయాం: దేవీశ్రీ ప్రసాద్

  • Jun 08, 2024 14:39 IST

    రామోజీరావు పార్ధీవదేహానికి చంద్రబాబు నివాళి..

    • టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రామోజీ ఫిలిం సిటీ చేరుకున్నారు.

    • రామోజీరావు పార్థివ దేహానికి చంద్రబాబు నివాళి.

  • Jun 08, 2024 14:29 IST

    రామోజీ రావుకి నివాళులర్పించిన నాదెండ్ల మనోహర్..

  • Jun 08, 2024 14:22 IST

    రామోజీరావుగారి మరణవార్త విని చాలా బాధపడ్డాను: ఎంఎస్‌కే ప్రసాద్( భారత మాజీ క్రికెటర్)

    • రామోజీరావుగారి మరణవార్త విని చాలా బాధపడ్డాను.

    • ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.

    • రామోజీ గారు నా జీవితాన్ని ఎంత ప్రభావితం చేశారో ఈ సందర్భంలో పంచుకోవాలనుకుంటున్నాను.

    • నేను అతని అద్భుతమైన పనిని మరియు నాయకత్వాన్ని చూశాను.

    • అతను నా రోల్ మోడల్‌లలో ఒకరు.

    • ఆయన అంకితభావం, దృక్పథం మరియు రచనలు నాపై చెరగని ముద్ర వేసాయి.

    • రామోజీరావు గారు అందించిన స్ఫూర్తికి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడిని.

  • Jun 08, 2024 13:48 IST

    అధికార లాంఛనాలతో అంత్యక్రియలు..

  • Jun 08, 2024 13:46 IST

    రామోజీరావుకు ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ నివాళులు..

    ఈనాడు గ్రూప్స్ చైర్మన్ రామోజీరావుకు ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ నివాళులు అర్పించారు. ఫిలింసిటీకి వెళ్లి అక్కడ ఆయన పార్థీవదేహానికి పుష్పాంజలి ఘటించారు. రామోజీరావు కుటుంబ సభ్యులను ఓదార్చారు.

  • Jun 08, 2024 13:45 IST

    ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు..

    • హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకున్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు.

    • చంద్రబాబు నాయుడు వెంట పలువురు ఎంపీలు.

    • శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా రామోజీ ఫిలిం సిటీ వెళ్ళనున్న చంద్రబాబు.

  • Jun 08, 2024 13:43 IST

    రామోజీరావు పార్థివ దేహానికి నివాళులర్పించిన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ

  • Jun 08, 2024 13:43 IST

    రామోజీరావు అంత్యక్రియలు జరిగేది ఇక్కడే..

  • Jun 08, 2024 13:42 IST

    భర్తను కడసారి చూసి కన్నీరుమున్నీరైన రామోజీ భార్య..

  • Jun 08, 2024 13:40 IST

    కన్నీరుపెట్టుకున్న రఘురామ..

  • Jun 08, 2024 13:39 IST

    రామోజీ మరణ వార్త తీవ్ర బాధ కలిగించింది: మహేష్ బాబు

    • ఎప్పుడూ ముందుండే దూరదృష్టి గల రామోజీ రావు గారు కన్నుమూసినందుకు చాలా బాధపడ్డాను.

    • రామోజీ ఫిలిం సిటీ సినిమాపై ఆయనకున్న అభిరుచికి నిదర్శనం.

    • ఆయన వారసత్వం మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుంది.

    • వారి ఆత్మకు శాంతి కలుగుగాక.

  • Jun 08, 2024 13:35 IST

    రామోజీరావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

    రామోజీరావు మృతి దేశానికి లోటు

    రామోజీరావు లేని లోటు ఎవరు తీర్చ లేరు

    రామోజీరావు కుటుంబ సభ్యులకు భగవంతుడు అండగా ఉండాలి

    సినిమా షూటింగ్ కి కావాల్సిన వ్యవస్థ రామోజీ ఫిల్మ్ సిటీలో ఉంది

    ఏ రంగం లో అయినా తనకంటూ ప్రత్యేక మైన స్థానం సంపాదించుకున్న వ్యక్తి

    తెలుగు భాషకు ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి రామోజీరావు

    రామోజీ ఆశయాలను ఆయన కుటుంబ సభ్యులు ముందుకు తీసుకెళ్లాలి

  • Jun 08, 2024 13:31 IST

    రామోజీరావు గారు మహోన్నతమైన వ్యక్తి: మోహన్ బాబు

    • పత్రికా రంగంలో రారాజు.

    • ప్రపంచంలోనే అతి పెద్ద ఫిలిం సిటీని దేశంలో నిర్మించారు.

    • నాకు 42 సం.లుగా ఆత్మీయ సంబందం ఉంది.

    • వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను.

    • వారు లేరంటే నమ్మలేకపోతున్నాను.

    • మనసు ఆవేదనతో నిండిపోయింది.

    • నా కుటుంబానికి..‌సినీ పరిశ్రమకు తీరని లోటు.

    • వారికి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్దిస్తున్నాను.

  • Jun 08, 2024 13:27 IST

    ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మృతిపై నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సంతాపం.

    • రామోజీరావు చిత్రపటానికి పట్టణ పార్టీ శ్రేణులతో కలసి పూలమాల వేసి నివాళులు.

    • తెలుగు భాష, జర్నలిజానికి ఎంతో కృషి చేశారు.

    • తంగిరాల సౌమ్య నందిగామ ఎమ్మెల్యే.

  • Jun 08, 2024 13:03 IST

    రామోజీరావు మృతికి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంతాపం

    • రామోజీరావు దేశవ్యాప్తంగా పేరుగాంచారు

    • ఆయన ఏరంగంలో ప్రవేశించినా సెలబ్రెటీ స్థాయికి ఎదిగారు

    • రామోజీరావు ను కలవాలని చాలాసార్లు ప్రయత్నించాను

    • కలవలేకపోయాను

    • రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా

  • Jun 08, 2024 13:00 IST

    అమరావతి: రామోజీరావు మరణ వార్త కలచివేసింది: వేణుగోపాలరావు

    • పత్రికా రంగానికి చెందిన నవయుగ వైతాళికుడు మరియు తెలుగు భాషకు తనదైన శైలిలో ఎనలేని సేవ చేసిన పద్మ విభూషణ అవార్డు గ్రహీత రామోజీరావు గారి మరణ వార్త ఎంతగానో తనని కలచి వేసింది.

    • ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నట్లు మరియు వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తున్నాను.

    • ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షులు అక్కెన వేణుగోపాలరావు

  • Jun 08, 2024 12:56 IST

    రామోజీరావు వ్యక్తి కాదు.. సంస్థ: వెంకయ్యనాయుడు

    పద్మవిభూషణ్, ఈనాడు గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ రామోజీరావు మృతి తనకు అత్యంత బాధాకరం అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఈ మేరకు ఆయన పోస్ట్ చేశారు. రామోజీరావు ఒక వ్యక్తి కాదని.. ఒక ఇన్‌స్టిట్యూషన్ అని పేర్కొన్నారు.

  • Jun 08, 2024 12:54 IST

    రామోజీ రావు గారి మరణం భాదాకరం: లంకా దినకర్

    • తెలుగు పత్రిక రంగంలో ఆయన ప్రస్థానం సువర్ణ అక్షరాలతో లిఖించదగిన ఖ్యాతి గడించారు.

    • సినిమా, టెలివిజన్ మాధ్యమాల ద్వారా సమాజానికి విలువలతో కూడిన మంచి మెసేజ్ తో పాటు వినోదాన్ని పెంచేందుకు ప్రాముఖ్యత ఇచ్చారు.

    • ప్రియ పచ్చళ్లు ద్వార తెలుగు రుచులను, కళాంజలి ద్వారా తెలుగు వారి చేతి వృత్తుల నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటారు.

    • ముఖ్యంగా హుదూద్ వంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు బాదితులను ఆదుకోవడానికి అయిన ఉదారత చాటారు.

    • సమాజంలో జరిగే అన్యాయాలను, అక్రమాల పైన నిరంతర పోరాటంతో స్ఫూర్తి అయిన “ ఉషా కిరణాలు “ పశ్చిమాన అస్తమించినా తూర్పు ఇంట ఉదయిస్తూనే ఉంటుంది.

  • Jun 08, 2024 12:53 IST

    రామోజీరావు మృతికి రాహుల్ సంతాపం..

    ‘భారతీయ మీడియా పరిశ్రమలో అగ్రగామిగా నిలిచిన పద్మవిభూషణ్, రామోజీ రావు గారి మరణవార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మృతి సంతాపం తెలియజేస్తున్నారు. జర్నలిజం, సినిమా, వినోదరంగంలో ఆయన చేసిన కృషి శాశ్వత ప్రభావాన్ని చూపించింది. మీడియా ల్యాండ్‌స్కేప్‌ను మార్చింది. ఈ కష్ట సమయంలో అతని కుటుంబం, స్నేహితులు, అభిమానులకు భగవంతుడు ధైర్యం కల్పించాలని కోరుకుంటున్నాను.’ అని రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

  • Jun 08, 2024 12:47 IST

    రామోజీ మృతికి అమిత్ షా సంతాపం..

    మీడియా దిగ్గజం, ప్రముఖ పారిశ్రామికవేత్త రామోజీరావు గారు మరణ వార్త చాలా బాధ కలిగించిందని కేంద్ర మాజీ హోమంత్రి అమిత్ షా అన్నారు. రామోజీ మృతికి సంతాపం తెలుపుతూ అమిత్ షా ఎక్స్‌లో పోస్ట్ చేవారు.

  • Jun 08, 2024 12:41 IST

    రామోజీరావు పార్థీవదేహానికి కేటీఆర్ నివాళులు..

    రామోజీరావు పార్థీవ దేహానికి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు.

  • Jun 08, 2024 12:40 IST

    రామోజీ మృతి బాధాకరం: ప్రధాని మోదీ

    ‘రామోజీ రావు మృతి చాలా బాధాకరం. ఆయన భారతీయ మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు. ఆయన గొప్ప రచనలు జర్నలిజం, చలనచిత్ర ప్రపంచంపై చెరగని ముద్ర వేసాయి. మీడియా, చలనచిత్రరంగంలో కొత్త చరిత్ర సృష్టించారు. రామోజీ రావు భారతదేశ అభివృద్ధి పట్ల చాలా మక్కువ చూపేవారు. నాకు ఆయనతో మాట్లాడే అవకాశం లభించడం, ఆయన నుంచి పలు అంశాలు నేర్చుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నారు. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అసంఖ్యాక అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నాను.’ అని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

  • Jun 08, 2024 12:36 IST

    రామోజీకి ఘన నివాళి.. టీడీపీ కీలక ప్రకటన..

    • రామోజీ రావు గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఘనమైన నివాళులు అర్పించాలని టీడీపీ పిలుపు

    • రామోజీ రావు మృతికి గ్రామ గ్రామాన సంతాప కార్యక్రమం నిర్వహించాలని తెలుగు దేశం పార్టీ అధిష్టానం నుంచి నేతలు, కార్యకర్తలకు ఆదేశాలు

    • అన్ని వర్గాల ప్రజలు రామోజీ గారికి నివాళి కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చిన తెలుగు దేశం

    • తెలుగు ప్రజల ప్రయోజనాల కోసం దశాబ్దాల పాటు పాటుపడిన రామోజీ గారికి ఘనమైన నివాళి అర్పించాలని తెలుగు దేశం పార్టీ కార్యకర్తలను, ప్రజలను కోరిన తెలుగు దేశం అధిష్టానం.

  • Jun 08, 2024 12:34 IST

    రామోజీ ఫిల్మ్ సిటీలో స్మృతి వనం..

    • జీవించి ఉండగానే సొంతంగా స్మారకం నిర్మించుకున్న ఏకైక వ్యక్తి రామోజీరావు.

  • Jun 08, 2024 12:32 IST

    రామోజీ ఫిల్మ్ సిటీ లో రామోజీ గ్రూప్స్ చైర్మన్ రామోజీ రావు పార్ధివ దేహానికి నివాళులు అర్పించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ,మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తదితర నేతలు..

    మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్..

    • శ్రమ పడితే ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చు అనడానికి రామోజీ రావు నిదర్శనం..

    • ఇంత ఉన్నత శిఖరాలకు ఏదిగిన రామోజీ రావు ఆదర్శ నీయుడు

    • వారి మరణాంపట్ల తీవ్ర సంతాపన్ని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్న..

    • రాబోయే తరానికి మార్గదర్శి రామోజీ రావు గారు.

    • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షానా కూడా వారి అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు..

    • వారికి ఘనంగా నివాళులు ..

    • వారు పత్రికా రంగంలో ,ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ప్రాంతీయ జిల్లా వార్తల నుండి చారిత్రాత్మక వార్తల వరకు మార్గదర్శకం

    • శ్రమ పడితే అందుకోలేనిది ఏమి ఉండదని వ్యక్తి రామోజీ రావు గారు..

    • విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి వారిని దగ్గరగా ఉండి చూసాను.. వారి జీవితం అదర్శమైంది..

    • వారి మరణానికి విచారం వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్న.

  • Jun 08, 2024 12:32 IST

    రామోజీరావు ఇంటి నుంచి ప్రత్యక్ష ప్రసారం..

  • Jun 08, 2024 12:30 IST

    చిత్తూరు: రామోజీరావు మృతికి చిత్తూరు పార్లమెంట్ ఎంపీ దగ్గుమల ప్రసాదరావు సంతాపం..

    రామోజీరావు మృతికి సంతాపం వ్యక్తం చేశారు చిత్తూరు పార్లమెంట్ ఎంపీ దగ్గుబాల ప్రసాదరావు.

    రామోజీరావు మృతి పత్రిక రంగానికి పేరుని లోటని అన్న దగ్గుమల.

    కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియ చేసిన దగ్గుమల.

  • Jun 08, 2024 12:30 IST

    రామోజీ మృతిపై కేటీఆర్ దిగ్బ్రాంతి..

  • Jun 08, 2024 12:30 IST

    రామోజీ రావుకు ప్రముఖుల నివాళి

  • Jun 08, 2024 12:20 IST

    విశాఖ: అనకాపల్లి ఎంపీ సిఎం రమేష్ కామెంట్స్..

    • రామోజీరావు మరణం మీడియా రంగానికే తీరని లోటు

    • ఆయన మృతికి ప్రగాఢ సంతాపం.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి

    • మీడియా, సినీ, టీవీ రంగాల్లో దిగ్గజంగా వెలిగిన రామోజీరావు మరణం బాధాకరం.

    • రామోజీరావు వ్యాపారాల్లో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని విజయపథంలో నడిపించిన మహా వ్యక్తి.

    • చెరుకూరి రామోజీరావు ఒక భారతీయ వ్యాపారవేత్తగా, ఈనాడు గ్రూపు సంస్థల అధినేతగా ప్రపంచంలోనే పేరు తెచ్చుకున్న మహా మేధావి.

    • తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకుడు, ప్రధాన సంపాదకుడు, ప్రచురణ కర్త ,మార్గదర్శి చిట్‌ఫండ్, ప్రియా ఫుడ్స్, కళాంజలి మొదలగు వ్యాపార సంస్థల అధినేతగా గుర్తింపు.

    • రామోజీరావు స్థాపించిన రామోజీ గ్రూపు ఆధీనంలో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించి అనేక మందికి ఉపాధి కలిపించిన రామోజీరావు.

    • 2016లో భారత ప్రభుత్వం అతనిని దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ తో సత్కరించింది.

  • Jun 08, 2024 12:00 IST

    Ramoji Rao Passed Away: ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన.. శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ నెల 5వ తేదీన ఆయన శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఎదురవడంతో.. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం పరమపదించారు. కాగా, ఫిల్మిసిటీలోని నివాసానికి ఆయన పార్థీవదేహాన్ని తరలించనున్నారు.

    Ramoji-Rao.jpg

    1936 నవంబర్‌ 16న ఏపీలోని కృష్ణా జిల్లా పెదపారుపూడిలో చెరుకూరి రామోజీరావు జన్మించారు. 1974 ఆగస్టు 10న విశాఖ తీరంలో ‘ఈనాడు’ దినపత్రికను ప్రారంభించారు. రామోజీరావు, ఒక భారతీయ వ్యాపారవేత్త, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత. తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకుడు, ప్రధాన సంపాదకుడు, ప్రచురణ కర్త. మార్గదర్శి చిట్‌ఫండ్, ప్రియా ఫుడ్స్, కళాంజలి తదితర వ్యాపార సంస్థల అధినేత. ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియోను నిర్మించిన దిగ్గజం. 2016లోనే దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్‌ అందుకున్న మహోన్నత వ్యక్తిగా కీర్తిగడించారు.