Share News

TG News: నార్సింగిలో వ్యాపారవేత్త కిడ్నాప్ కలకలం

ABN , Publish Date - Jun 09 , 2024 | 08:22 PM

భాగ్యనగరంలోని నార్సింగిలో ఓ వ్యాపారవేత్త కిడ్నాప్ కలకలం సృష్టించింది. అర్ధరాత్రి వ్యాపారవేత్త శిశువర్దన్ రెడ్డిపై దాడి చేసి కారులో రాయలసీమకు చెందిన వ్యక్తులు బలవంతంగా ఎక్కించుకున్నారని సమాచారం.

TG News: నార్సింగిలో వ్యాపారవేత్త కిడ్నాప్ కలకలం

హైదరాబాద్: భాగ్యనగరంలోని నార్సింగిలో ఓ వ్యాపారవేత్త కిడ్నాప్ కలకలం సృష్టించింది. నిన్న(శనివారం) అర్ధరాత్రి వ్యాపారవేత్త శిశువర్ధన్ రెడ్డిపై దాడి చేసి కారులో రాయలసీమకు చెందిన వ్యక్తులు బలవంతంగా తీసుకెళ్లారు. పోలీసులు చాకచక్యంగా నిందితులను పట్టుకున్నారు. వారి చెరలో ఉన్న వ్యాపారి శిశువర్ధన్ రెడ్డిని రక్షించారు. అయితే ఈ విషయంపై నర్సింగి ఏసీపీ రమణ గౌడ్ మీడియాకు కీలక విషయాలు వెల్లడించారు. ఈ నెల 8వ తేదీ రాత్రి 9:20 గంటలకు ఎన్‌సీసీ అర్బన్ వన్ ఎదురుగా నార్సింగి రాయల్టీ వద్ద వ్యాపారి కిడ్నాప్ జరిగిందని అన్నారు. శిశువర్ధన్ రెడ్డిని కిడ్నాప్ చేసినట్లు డయల్ 100 ద్వారా సమాచారం వచ్చిందని చెప్పారు.


శిశు వర్ధన్ రెడ్డికి క్రాంతి, సందీప్ మధ్య .2.5 కోట్ల రూపాయల ఆర్ధిక లావాదేవీల గొడవలు ఉన్నాయన్నారు. 8వ తేదీ రాత్రి శిశు వర్ధన్ రెడ్డి తన బిజినెస్ పార్టనర్ సుస్మిత వాహనంలో వస్తుండగా అందే క్రాంతి, సందీప్ కిడ్నాప్ చేశారని తెలిపారు. శిశు వర్ధన్ రెడ్డిని కొట్టి, చంపుతామని బెదిరించారని తెలిపారు. డబ్బులు ఎలాగైనా వసూలు చేయాలని బ్రిజా కారులో వ్యాపారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని అన్నారు. బాధితుడు భార్య వెంటనే అరుణ ఫిర్యాదు చేశారని తెలిపారు. కంట్రోల్ రూమ్స్, ఇంటర్ స్టేట్, ఇంటర్ సెప్టార్, బార్డర్స్, చెక్ పోస్ట్‌లను అలర్ట్ చేశామని తెలిపారు. శిశువర్ధన్ రెడ్డిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న బ్రీజా కార్ కర్నూల్ వైపు వెళ్తున్నట్లు తెలిసిందన్నారు.


అడ్డాకుల పోలీస్ టోల్ గేట్ వద్ద తమ పోలీస్ టీం కార్‌ను నిందితులు ట్రేస్ చేశారని చెప్పారు. నిందితులు క్రాంతి, సందీప్ డబ్బుల కోసం కిడ్నాప్ చేసినట్లు తేల్చామని అన్నారు. ఇద్దరు ఎలక్ట్రానిక్స్, గోల్డ్ ఫీల్డ్ వ్యాపారంలో ఉన్నారని చెప్పారు.ఏసీల బిజినెస్‌లో బాధితుడు శేషు వర్ధన్ రెడ్డితో కలిసి కిడ్నాపర్లు పని చేశారని చెప్పారు. తర్వాత గోల్డ్ బిజినెస్‌లో కూడా కలిసి చేశారన్నారు. వ్యాపారి శిశు వర్ధన్ రెడ్డి, కిడ్నాపర్లు క్రాంతి & సందీప్ లకు డబ్బులు ఇవ్వాలని చెప్పారు. వ్యాపారి శిశు వర్ధన్ రెడ్డి, డబ్బులు ఇవ్వలేదని.. దీంతో సందీప్ క్రాంతి శిశు వర్ధన్ రెడ్డిని కిడ్నాప్ చేశారని వివరించారు. ఇద్దరు నిందితులను రిమాండ్‌కు తరలించామని నర్సింగి ఏసీపీ రమణ గౌడ్ పేర్కొన్నారు.

Updated Date - Jun 09 , 2024 | 08:45 PM