TS Politics: బీజేపీ, బీఆర్ఎస్‌కు భారీ షాక్ ఇచ్చిన కీలక నేతలు.. సీఎం రేవంత్‌ను కలిసింది అందుకేనా..?
ABN , Publish Date - Mar 03 , 2024 | 10:39 PM
రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారిచింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన బూస్టప్‌తో అత్యధిక ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇందుకోసం పలు ప్రణాళికలను రూపొందించినట్లు తెలుస్తోంది. బీజేపీ(BJP), బీఆర్ఎస్(BRS) పార్టీల్లో అత్యంత ప్రజాధరణ ఉన్న నేతలను తమ పార్టీలోకి తీసుకు వచ్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) పలు ప్లాన్‌లను రూపొందించారు.
హైదరాబాద్: రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారిచింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన బూస్టప్‌తో అత్యధిక ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇందుకోసం పలు ప్రణాళికలను రూపొందించినట్లు తెలుస్తోంది. బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS) పార్టీల్లో అత్యంత ప్రజాధారణ ఉన్న నేతలను తమ పార్టీలోకి తీసుకు వచ్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) పలు ప్లాన్‌లను రూపొందించారు. ఈ రెండు పార్టీల నేతలపై ఆపరేషన్ ఆకర్ష్ మొదలెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి నేడు(ఆదివారం) రేవంత్ రెడ్డిని కలిశారు. వీరిద్దరూ కూడా పార్లమెంట్ టికెట్‌పై ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. నాగర్ కర్నూల్ నుంచి బంగారు శృతి టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. వరంగల్ ఎంపీ టికెట్‌కు గుండు సుధారాణి కూడా పోటీ పడుతున్నట్లు సమాచారం.
శృతి.. అందుకే కలిశారా..?
సీఎం రేవంత్ రెడ్డిని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి నేడు(ఆదివారం) కలిశారు. నాగర్‌కర్నూల్ పార్లమెంటు టికెట్ ఆశించి బంగారు శృతి భంగపడ్డారు. నాగర్‌కర్నూల్ టికెట్‌ను ఇటీవల బీజేపీలో చేరిన ఎంపీ రాములు కుమారుడు భరత్‌కు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆమె బీజేపీపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డిని బంగారు శృతి సైలెంట్‌గా కలిశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పని చేసిన బంగారు లక్ష్మణ్ కూతురే శృతి. పార్టీ అంతర్గత, ఆర్థిక అంశాలు పూర్తిగా తెలిసిన వ్యక్తి కావడంతో కమలనాథులు తలలు పట్టుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందు ఆమె సీఎం రేవంత్‌ను కలవటంతో కమలం పార్టీకి కొంతమేర నష్టం చేకూర్చే అంశంగా హై కమాండ్ భావిస్తుంది. అయితే కాంగ్రెస్ నుంచి ఎంపీ టికెట్ కోసం ఆమె ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

కాంగ్రెస్‌లోకి సుధారాణి.. కారు పార్టీకి షాక్
కాగా.. వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. కాంగ్రెస్‌లోకి వరంగల్ మేయర్ గుండు సుధారాణి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. నేడు(ఆదివారం) సీఎం రేవంత్ రెడ్డిని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి సుధారాణి కలిశారు. రెండు, మూడు రోజుల్లో ఆమె కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ నుంచి మేయర్‌గా సుధారాణి ఎన్నికైన విషయం తెలిసిందే. ఆమె కాంగ్రెస్‌లోకి వెళ్తుండటంతో వరంగల్ జిల్లాలో కారు పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో భారీ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి