Share News

Boora Narsaiah Goud: ఆ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి కళ్లలో ఆనందం లేదు

ABN , Publish Date - Jan 01 , 2024 | 08:52 PM

కొత్త ఏడాది తెలంగాణ ఆస్తులు పెరిగి గ్యారెంటీలు అమలు చేయాలని ఆశిస్తున్నానని మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత బూర నర్సయ్య గౌడ్ ( Boora Narsaiah Goud ) తెలిపారు. సోమవారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ 30 రోజుల్లో కాంగ్రెస్ సాధించింది కేవలం శ్వేత పత్రం మాత్రమేనని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకే గ్యారంటీ లేదు.. అందుకే కాలయాపన చేస్తున్నారని బూర నర్సయ్య గౌడ్ మండిపడ్డారు.

Boora Narsaiah Goud: ఆ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి కళ్లలో ఆనందం లేదు

హైదరాబాద్: కొత్త ఏడాది తెలంగాణ ఆస్తులు పెరిగి గ్యారెంటీలు అమలు చేయాలని ఆశిస్తున్నానని మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత భూర నర్సయ్య గౌడ్ ( Boora Narsaiah Goud ) తెలిపారు. సోమవారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ 30 రోజుల్లో కాంగ్రెస్ సాధించింది కేవలం శ్వేత పత్రం మాత్రమేనని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకే గ్యారంటీ లేదు.. అందుకే కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు మోసపోతే గోస పడతారన్నారు. బీఆర్‌ఎస్ శ్రమటోడ్చి 6. 32 వేల కోట్ల అప్పు చేసిందని హేలన చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వేసిన రోడ్ల వళ్లే రాష్ట్రంలో భూముల రేట్లు పెరిగాయని చెప్పారు. రాష్ట్రంలో ఒక్క రోడ్డును కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించడం లేదన్నారు. మోదీ జెన్ కో ట్రాన్స్ కో కి 80 వేల కోట్ల అప్పు ఇస్తే ..కేసీఆర్ 24గంటల కరెంట్ ఇచ్చారని తెలిపారు. ఖజానా లేదని.. సీఎం రేవంత్ కళ్లలో ఆనందం లేదన్నారు. కేసీఆర్ మొత్తం గికేసి పోయాడన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో ఉన్న 17 ఎంపీ సీట్లలో బీజేపీ పార్టీని గెలిపించాలని భూర నర్సయ్య గౌడ్ పేర్కొన్నారు.

Updated Date - Jan 01 , 2024 | 08:52 PM