Share News

Hyderabad: రాడిసన్ హోటల్‌లో పెద్ద ఎత్తున డ్రగ్స్‌ పార్టీ.. యువకుల్లో ప్రముఖ బీజేపీ నేత కుమారుడు

ABN , Publish Date - Feb 26 , 2024 | 08:50 AM

డ్రగ్స్‌ను కట్టడి చేసేందుకు పోలీసులు ఎంతలా ప్రయత్నిస్తున్నా కూడా అది సాధ్యపడటం లేదు. గచ్చిబౌలిలో డ్రగ్స్ కలకలం రేగింది. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్‌లో కొందరు యువకులు గ్రాండ్‌గా పార్టీ చేసుకున్నారు. వారిలో ఒక ప్రముఖ బీజేపీ నేత కుమారుడితో పాటు వ్యాపారవేత్త కుమారుడు కూడా ఉన్నాడు.

Hyderabad: రాడిసన్ హోటల్‌లో పెద్ద ఎత్తున డ్రగ్స్‌ పార్టీ.. యువకుల్లో ప్రముఖ బీజేపీ నేత కుమారుడు

హైదరాబాద్: డ్రగ్స్‌ (Drugs)ను కట్టడి చేసేందుకు పోలీసులు (Police) ఎంతలా ప్రయత్నిస్తున్నా కూడా అది సాధ్యపడటం లేదు. నేడు గచ్చిబౌలి (Gachibowli)లో డ్రగ్స్ కలకలం రేగింది. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్‌లో డ్రగ్స్‌ తీసుకున్న కొందరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాడిసన్ హోటల్‌ (Radison Hotel)లో సదరు యువకులు గ్రాండ్‌గా పార్టీ చేసుకున్నారు. వారిలో ఒక ప్రముఖ బీజేపీ (BJP) నేత కుమారుడితో పాటు వ్యాపారవేత్త కుమారుడు కూడా ఉన్నాడు. ఈ పార్టీలో డ్రగ్స్, మద్యం ఏరులై పారినట్టు తెలుస్తోంది.

యువకులు పెద్ద ఎత్తున డ్రగ్స్ తీసుకున్నారు. పోలీసులు పక్కా సమాచారంతో రాడిసన్ హోటల్‌పై దాడి చేశారు. డ్రగ్స్ తీసుకున్నట్టు గుర్తించి ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద పెద్ద మొత్తంలో కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ప్రముఖ వ్యాపారవేత్తతో పాటు బీజేపీ నేత కుమారుడు కూడా ఉన్నారు. 2009లో శేరిలింగంపల్లి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన యోగానంద్ కుమారుడు వివేకానంద రాడిసన్ హోటల్‌లో డ్రగ్స్ తీసుకుని పట్టుబడ్డాడు. హోటల్ కూడా యోగానంద్‌దేనని తెలుస్తోంది. మూడు రోజులుగా ఈ ముగ్గురూ పార్టీ చేసుకుంటున్నట్టు సమాచారం. ముగ్గురు యువకులనూ పోలీసులు విచారిస్తున్నారు.

Updated Date - Feb 26 , 2024 | 09:51 AM