TS NEWS: మళ్లీ ప్రధాని మోదీనే .. బీజేపీ నేత సుధాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Feb 18 , 2024 | 06:23 PM
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఢిల్లీలో 17, 18 తేదీల్లో కేంద్ర హై కమాండ్ నిర్వహించింది. ఈ సమావేశాలకు సంబంధించిన పలు విషయాలను మీడియాకు బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి (Sudhakar Reddy) వెల్లడించారు.
హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఢిల్లీలో 17, 18 తేదీల్లో కేంద్ర హై కమాండ్ నిర్వహించింది. ఈ సమావేశాలకు సంబంధించిన పలు విషయాలను మీడియాకు బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి (Sudhakar Reddy) వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశ పరిస్థితులు, పదేళ్లలో జరిగిన అభివృద్ధిపై చర్చ జరిగిందని తెలిపారు. ఈ సభ నుంచే ఎన్నికల శంఖారావం పూరించామని తెలిపారు.‘‘ఫిర్ ఎక్ బార్ మోదీ సర్కారు, ఇంటింటికీ కమలం’’ అనే నినాదంతో ఎన్నికలకు వెళ్తున్నామని తెలిపారు.
బీజేపీ నేతలంతా ప్రజల దగ్గరకు వెళ్లి కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించాలని చెప్పారని అన్నారు. 370 స్థానాలే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారన్నారు. ఇండియా కూటమి విఫల కూటమి అయిందని చెప్పారు. దేశానికి మోదీ రక్షకుడని.. ప్రధానిగా మరోసారి మోదీ బాధ్యతలు చేపడతారని సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...