Share News

Bandla Ganesh: బాబోయ్.. రోజాను బండ్ల గణేష్ ఇన్ని మాటలు అన్నారేంటో?

ABN , Publish Date - Feb 27 , 2024 | 01:49 PM

ఏపీ మంత్రి రోజాపై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రోజా డైమండ్ రాణి అని.. రేవంత్ ఫైటర్, జగన్ ఆక్సిడెంట్ సీఎం అని పేర్కొన్నారు. తండ్రి చనిపోతే సీఎం అయిన వ్యక్తులు ఉన్నారన్నారు. పులుసు వండి పెట్టావ్ కాబట్టి.. పులుసు రాణి మాత్రమే కాకుండా రోజా ఐటం రాణి అని పేర్కొన్నారు.

Bandla Ganesh: బాబోయ్.. రోజాను బండ్ల గణేష్ ఇన్ని మాటలు అన్నారేంటో?

హైదరాబాద్: ఏపీ మంత్రి రోజా (Roja)పై కాంగ్రెస్ నేత, టాలీవుడ్ నటుడు బండ్ల గణేష్ (Bandla Ganesh) సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ భవన్‌లో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. రోజా డైమండ్ రాణి అని.. రేవంత్ (CM Revanth Reddy) ఫైటర్, జగన్ (Jagan) ఆక్సిడెంట్ సీఎం అని పేర్కొన్నారు. తండ్రి చనిపోతే సీఎం అయిన వ్యక్తులు ఉన్నారన్నారు. పులుసు వండి పెట్టావ్ కాబట్టి.. పులుసు రాణి మాత్రమే కాకుండా రోజా ఐటం రాణి అని పేర్కొన్నారు.

మేడిగడ్డ (Medigadda)కి వెళ్లి బీఆర్ఎస్ (BRS) నాయకులు ఏం చేస్తారని ప్రశ్నించారు. మేడిగడ్డను ఎలా నాశనం చేశారో చూసి వస్తారా? అని బండ్ల గణేష్ ప్రశ్నించారు. మేడిగడ్డ కూలిపోతే మాదే బాధ్యత అని బీఆర్ఎస్ చెప్పాలన్నారు. పనికిరానప్పుడు తీసేయడం తప్ప ఏం చేస్తారని ప్రశ్నించారు. మూడు పిల్లర్లు ముప్పై పిల్లర్లు కాకుండా కాపాడుతున్నామని బండ్ల గణేష్ పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 27 , 2024 | 01:54 PM