Share News

Hyderabad: ఔరంగాబాద్‌లో ఓటమితో లోక్‌సభలో మజ్లిస్‏కు మళ్లీ ఒకే ఒక్కడు..!

ABN , Publish Date - Jun 06 , 2024 | 12:21 PM

గత లోక్‏సభలో ఆలిండియా మజ్లిస్‌ ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌(మజ్లి్స్) పార్టీకి ఇద్దరు సభ్యులుండగా ఈసారి ఒకే ఒక్క సభ్యుడితో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. హైదరాబాద్‌(Hyderabad) కేంద్రంగా జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న మజ్లిస్‌ మొట్టమొదటిసారి 1984 పార్లమెంట్‌ ఎన్నికల్లో విజయం సాధించి లోకసభలో అడుగుపెట్టింది.

Hyderabad: ఔరంగాబాద్‌లో ఓటమితో లోక్‌సభలో మజ్లిస్‏కు మళ్లీ ఒకే ఒక్కడు..!

హైదరాబాద్‌: గత లోక్‏సభలో ఆలిండియా మజ్లిస్‌ ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌(మజ్లిస్) పార్టీకి ఇద్దరు సభ్యులుండగా ఈసారి ఒకే ఒక్క సభ్యుడితో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. హైదరాబాద్‌(Hyderabad) కేంద్రంగా జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న మజ్లిస్‌ మొట్టమొదటిసారి 1984 పార్లమెంట్‌ ఎన్నికల్లో విజయం సాధించి లోకసభలో అడుగుపెట్టింది. అప్పటి నుంచి వరుసగా ఆరుసార్లు సుల్తాన్‌ సలాఉద్దీన్‌ ఒవైసీ, అనంతరం ఆయన కుమారుడు అసదుద్దీన్‌ ఒవైసీ 2004 నుంచి ఇప్పటి వరకు ఐదుసార్లు లోకసభ సభ్యుడిగా వరుసగా ఎన్ని కయ్యారు. ఈ సారి అసదుద్దీన్‌ ఒవైసీ భారీ మెజారిటీతో లోకసభకు ఎన్నికయ్యారు. కాగా, 2019లో మహారాష్ట్రలో జరిగిన రాజకీయ పరిణామాల్లో ఔరంగాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి మజ్లిస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన ఇంతియాజ్‌ జలీల్‌ విజయం సాధించి లోకసభలో అడుగుపెట్టారు.

ఇదికూడా చదవండి: Hyderabad: నిలువునా ముంచిన కేటుగాళ్లు.. లోన్‌ ఇప్పించి.. రూ.34.90 లక్షలు కొట్టేశారు


దీంతో గత లోకసభలో మజ్లిస్ కు ఇద్దరు సభ్యుల బలం ఉండేది. ఈసారి ఔరంగాబాద్‌ నుంచి పోటీ చేసిన ఇంతియాజ్‌జలీల్‌ శివసేన(Shiv Sena) అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. అలాగే, బీహార్‌లోని కిషన్‌గంజ్‌ సీటును కైవసం చేసుకునేందుకు మజ్లిస్‌ తీవ్రంగా ప్రయత్నించింది. పార్టీ ఆ రాష్ట్రశాఖ అధ్యక్షుడు అక్తరుల్‌ ఇమాన్‌ను అభ్యర్థిగా ఖరారు చేసింది. పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ సైతం రెండు దఫాలుగా బీహార్‌(Bihar)లో పర్యటించి కిషన్‌గంజ్‌లో అక్తరుల్‌ ఇమాన్‌ను గెలిపించేందుకు విస్తృతంగా ప్రచారం చేసినా విజయం సాధించలేకపోయారు. మూడోస్థానానికి సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గతంలో లాగే మళ్లీ లోకసభలో మజ్లిస్‌ పార్టీ ప్రతినిధిగా అసదుద్దీన్‌ ఒవైసీ ఒక్కరే ప్రాతినిధ్యం వహించనున్నారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 06 , 2024 | 12:21 PM