Share News

Hyderabad: ఆ నాలుగు డివిజన్లకు ఉప ఎన్నికలు ఎప్పుడో..?

ABN , Publish Date - Jun 07 , 2024 | 10:16 AM

గ్రేటర్‌లో నాలుగు డివిజన్లు ఖాళీ అయ్యాయి. రెండు స్థానాల్లో కార్పొరేటర్లు మరణించగా.. ఓ కార్పొరేటర్‌ ఎమ్మెల్సీగా, మరో కార్పొరేటర్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో ఆయా స్థానాలకు ఉప ఎన్నికలు(By-elections) జరగాల్సి ఉంది. గుడిమల్కాపూర్‌ నుంచి బీజేపీ(BJP) తరఫున కార్పొరేటర్‌గా ఎన్నికైన దేవర కరుణాకర్‌ 2023 జనవరిలో అనారోగ్యంతో మరణించారు.

Hyderabad: ఆ నాలుగు డివిజన్లకు ఉప ఎన్నికలు ఎప్పుడో..?

- గ్రేటర్‌లో నాలుగు డివిజన్లు ఖాళీ

- ఇద్దరు కార్పొరేటర్ల అకాల మరణం

- ఎమ్మెల్యేలుగా ఎన్నికైన మరో ఇద్దరు

హైదరాబాద్‌ సిటీ: గ్రేటర్‌లో నాలుగు డివిజన్లు ఖాళీ అయ్యాయి. రెండు స్థానాల్లో కార్పొరేటర్లు మరణించగా.. ఓ కార్పొరేటర్‌ ఎమ్మెల్సీగా, మరో కార్పొరేటర్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో ఆయా స్థానాలకు ఉప ఎన్నికలు(By-elections) జరగాల్సి ఉంది. గుడిమల్కాపూర్‌ నుంచి బీజేపీ(BJP) తరఫున కార్పొరేటర్‌గా ఎన్నికైన దేవర కరుణాకర్‌ 2023 జనవరిలో అనారోగ్యంతో మరణించారు. ఆరు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెహిదీపట్నం కార్పొరేటర్‌ మహ్మద్‌ మాజీద్‌హుస్సేన్‌ (ఎంఐఎం) నాంపల్లి శాసనసభ్యుడిగా, రామ్నా్‌సపుర కార్పొరేటర్‌ మహ్మద్‌ ముబీన్‌ బహదూర్‌పురా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎర్రగడ్డ డివిజన్‌ నుంచి విజయం సాధించిన ఎంఐఎం కార్పొరేటర్‌ షాహిన్‌బేగం ఇటీవల చనిపోయారు. గ్రేటర్‌లో 150 డివిజన్లు ఉండగా.. ప్రస్తుతం కౌన్సిల్‌లో 146 మంది కార్పొరేటర్లు మాత్రమే ఉన్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: మార్కెట్‌కు పోటెత్తిన మృగశిర చేపలు..


జీహెచ్‌ఎంసీ చట్టం 1955 ప్రకారం.. కార్పొరేటర్‌ మరణించిన నాలుగు నెలల్లో ఉప ఎన్నికలు నిర్వహించాలి. దేవర కరుణాకర్‌ మరణించి యేడాదిన్నర కాగా.. మరో ఇద్దరు కార్పొరేటర్లు శాసనసభ్యులుగా ఎన్నికై ఆరు నెలలు దాటింది. అయినా, ఇప్పటి వరకు ఉప ఎన్నికలు నిర్వహించలేదు. ఖాళీ అయిన డివిజన్ల వివరాలు పంపుతూ.. ఉప ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని గతంలో పలుమార్లు ఎన్నికల సంఘానికి జీహెచ్‌ఎంసీ(GHMC) లేఖ రాసింది. షాహిన్‌ బేగం మరణం నేపథ్యంలో గురువారం ఎర్రగడ్డ స్థానం ఖాళీ అయ్యిందని పేర్కొంటూ కమిషనర్‌ ఆమోదం తీసుకున్నారు. ఎన్నికల విభాగం ద్వారా ఈ ఫైల్‌ను త్వరలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపనున్నారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఉప ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందా..? లేదా? అన్నది చూడాలి.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 07 , 2024 | 10:16 AM