Share News

Hyderabad: హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేందుకు కుట్ర..

ABN , Publish Date - May 26 , 2024 | 01:32 PM

హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా(యూటీ) మార్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని జల్‌పల్లి మున్సిపాలిటీ బీఆర్‌ఎస్‌(BRS) అధ్యక్షుడు షర్ఫుద్దీన్‌ హమేదీ పేర్కొన్నారు. నగరాన్ని యూటీ చేస్తే హైదరాబాద్‌(Hyderabad: ) మనకు దక్కదని ఆందోళన వ్యక్తంచేశారు,

Hyderabad: హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేందుకు కుట్ర..

- జల్‌పల్లి మున్సిపాలిటీ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు షర్ఫుద్దీన్‌ హమేదీ

హైదరాబాద్‌: హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా(యూటీ) మార్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని జల్‌పల్లి మున్సిపాలిటీ బీఆర్‌ఎస్‌(BRS) అధ్యక్షుడు షర్ఫుద్దీన్‌ హమేదీ పేర్కొన్నారు. నగరాన్ని యూటీ చేస్తే హైదరాబాద్‌(Hyderabad: ) మనకు దక్కదని ఆందోళన వ్యక్తంచేశారు, హైదరాబాద్‌ లేని తెలంగాణ.. తల లేని మొండెంలాంటిదన్నారు. ఆదివారం ఎర్రకుంటలోని ఆయన కార్యాలయంలో మీడియాతో షర్ఫుద్దీన్‌ మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో.. ప్రశ్నించే గొంతుకనే గెలిపించాలన్నారు. కాంగ్రెస్‌(Congress) నిజ స్వరూపం ఆరు నెలల్లోనే బయటపడిందన్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: జీహెచ్‌ఎంసీలో ఉద్యోగాలంటూ మోసం..


ఆరు నెలలు అయినా ఉద్యోగ నోటిఫికేషన్‌ ఇవ్వలేదన్నారు విమర్శించారు. నిరుద్యోగ భృతి విషయంలో అడిగితే.. హామీనే ఇవ్వలేదని కాంగ్రెస్‌ చేతులెత్తేసిందన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓడిస్తేనే కాంగ్రెస్‏కు కనువిప్పు కలుగుతుందని అన్నారు. ఖమ్మం(Khammam) జిల్లాలోని 5 మండలాలను ఏపీకి బీజేపీ అప్పగించిందని గుర్తుచేశారు. ఇప్పుడు హైదరాబాదును యూటీ చేసేందుకు కాంగ్రెస్‌, బీజేపీ కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్‌ అధికారంలో వచ్చినప్పటినుంచి బీఆర్‌ఎస్‌ నాయకులపై దాడులు పెరిగి పోయాయాని కొల్లాపూర్‌లో బీఆర్‌ఎస్‌ నాయకుల హత్యలు కాంగ్రెస్‌ దివాళాకోరుతనానికి నిదర్శనమ్మన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తమ పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

ఇదికూడా చదవండి: Hyderabad: పోలింగ్‌ రోజున.. తగ్గిన పొల్యూషన్‌

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu Newshy

Updated Date - May 26 , 2024 | 01:32 PM