Share News

Hyderabad: జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆమ్రపాలి కాట..

ABN , Publish Date - Jun 27 , 2024 | 10:49 AM

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌(GHMC Commissioner)గా ఆమ్రపాలి కాట బాధ్యతలు స్వీకరించారు. రోనాల్డ్‌రోస్‌(Ronaldros) బల్దియా నుంచి బుధవారం రిలీవ్‌ అయ్యారు. రెండు వారాల క్రితం రోనాల్డ్‌ వ్యక్తిగత పనుల నిమిత్తం విదేశాలకు వెళ్లగా ఆమ్రపాలికి పూర్తి అదనపు బాధ్యత(ఎఫ్ఏసీ)లు అప్పగించారు.

Hyderabad: జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆమ్రపాలి కాట..

హైదరాబాద్‌ సిటీ: జీహెచ్‌ఎంసీ కమిషనర్‌(GHMC Commissioner)గా ఆమ్రపాలి కాట బాధ్యతలు స్వీకరించారు. రోనాల్డ్‌రోస్‌(Ronaldros) బల్దియా నుంచి బుధవారం రిలీవ్‌ అయ్యారు. రెండు వారాల క్రితం రోనాల్డ్‌ వ్యక్తిగత పనుల నిమిత్తం విదేశాలకు వెళ్లగా ఆమ్రపాలికి పూర్తి అదనపు బాధ్యత(ఎఫ్ఏసీ)లు అప్పగించారు. ఇటీవల జరిగిన ఐఏఎ్‌సల బదిలీ ఉత్తుర్వుల్లో ఆమెను ఎఫ్‌ఏసీ కమిషనర్‌గా కొనసాగిస్తున్నట్టు పేర్కొన్నారు. దీంతో ఆమ్రపాలి అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బదిలీపై జీహెచ్‌ఎంసీకి వచ్చిన జోనల్‌ కమిషనర్లు పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌, అనురాగ్‌ జయంతి, అదనపు కమిషనర్లు ఉపేందర్‌రెడ్డి తదితరులు నూతన కమిషనర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆమ్రపాలి జీహెచ్‌ఎంసీలో అదనపు కమిషనర్‌గా గతంలో కొన్నాళ్లు పని చేశారు. సంస్థలోని పరిస్థితులపై ఆమెకు కొంత మేర అవగాహన ఉంది.

ఇదికూడా చదవండి: TSRTC: గ్రేటర్‌ నుంచి పుణ్యక్షేత్రాలకు బస్సులు..


బదిలీ ఉత్తర్వులు వెలువడిన సమయంలో ఢిల్లీలో ఉన్న ఆమ్రపాలి బుధవారం నగరానికి వచ్చారు. రోనాల్డ్‌రోస్‌ నుంచి బాధ్యతలు స్వీకరించాక సచివాలయంలో జరిగిన సమావేశానికి వెళ్లినట్టు తెలిసింది. రోనాల్డ్‌ ఇంధన శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. కాగా, ఆమ్రపాలి ఇప్పటికే హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) జాయింట్‌ కమిషనర్‌, హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ (హెచ్‌జీసీఎల్‌), మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవల్‌పమెంట్‌ లిమిటెడ్‌ (ఎంఆర్‌డీసీఎల్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. బల్దియాలో కొనసాగాలనుకుంటే ఆ మూడు బాధ్యతల నుంచి మినహాయింపునివ్వడం లేదా జీహెచ్‌ఎంసీకి రెగ్యులర్‌ కమిషనర్‌ను నియమిస్తే ఇప్పటికే ఉన్న పోస్టుల్లో కొనసాగాలని ఆమ్రపాలి భావిస్తున్నట్టు సమాచారం.


city4.4.jpg

ఈవీడీఎం కమిషనర్‌గా ఏవీ రంగనాథ్‌ జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విజిలెన్స్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌(ఈవీడీఎం) కమిషనర్‌గా ఏవీ రంగనాథ్‌ బుధవారం బుద్ధభవన్‌లోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఈవీడీఎంలో డైరెక్టర్‌ పోస్టు మాత్రమే ఉండేది. ఐపీఎస్‌ అధికారులు విశ్వజిత్‌ కంపాటి, ఎన్‌ ప్రకా్‌షరెడ్డిలు డైరెక్టర్లుగా కొనసాగారు. ప్రకాష్ రెడ్డి స్థానంలో రంగనాథ్‌కు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఆయన కమిషనర్‌గా కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసే యోచనలో ఉందని, అందుకే కమిషనర్‌గా ఆయనను నియమించారని ఓ అధికారి తెలిపారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 27 , 2024 | 10:49 AM