Share News

Hyderabad: చిలుకూరు బాలాజీ టెంపుల్‌కు వెళ్తున్నారా?

ABN , Publish Date - Apr 19 , 2024 | 09:53 AM

Telangana: చిలుకూరు బాలాజీ టెంపుల్‌కు భక్తులు క్యూ కట్టారు. పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీనివాసుడి ఆలయానికి తరలివెళ్తున్నారు. దీంతో ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అయితే రోజూ కంటే కూడా వీకెండ్స్, సెలవుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉండే చిలూకూరు బాలాజీ టెంపల్‌కు ఈరోజు (శుక్రవారం) భారీగా భక్తులు ఎందుకు తరలుతున్నారు.

Hyderabad: చిలుకూరు బాలాజీ టెంపుల్‌కు వెళ్తున్నారా?
Chilkur Balaji Temple

హైదరాబాద్, ఏప్రిల్ 19: చిలుకూరు బాలాజీ టెంపుల్‌కు (Chilukuru Balaji Temple) భక్తులు క్యూ కట్టారు. పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీనివాసుడి ఆలయానికి తరలివెళ్తున్నారు. దీంతో హైదరాబాద్ ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై (Hyderabad Outer Ring Road) భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అయితే రోజూ కంటే కూడా వీకెండ్స్, సెలవుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉండే చిలూకూరు బాలాజీ టెంపల్‌కు ఈరోజు (శుక్రవారం) భారీగా భక్తులు ఎందుకు తరలుతున్నారు. ఈరోజు ఆ ఆలయంలో ఏం ప్రత్యేకత ఉంది? ట్రాఫిక్ జామ్‌కు గల కారణాలేంటో చూద్దాం.

YSRCP: బస్సు లోపల్నుంచే జగన్ షో!


ఇదీ అసలు సంగతి...

కాగా.. నగరంలోని ఔటర్ రింగ్‌ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్‌ను కంట్రోల్ చేసే పనిలో పడ్డారు. అయితే ఈరోజు ఉదయం ఐదు గంటల నుంచి చిలుకూరు బాలాజీ దేవాలయానికి భక్తులు బారులు తీరారు. ఆలయంలో ఈరోజు గరుడ ప్రసాదం పంపిణీ జరుగుతోంది. ముఖ్యంగా సంతానం లేని వారి కోసం ప్రత్యేక తీర్థ ప్రసాదాలును ఆలయ పూజారి పంపిణీ చేస్తున్నారు.

Lok Sabha Election 2024: 2024 లోక్‌సభ ఎన్నికల ఫేజ్1 ఓటింగ్ షూరూ.. ఎంత మంది పోటీ అంటే..



విషయం తెలిసిన భక్తులు హైదరాబాద్‌తో పాటు చుట్టు పక్కల నుంచి కారులల్లో పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఔటర్ రింగ్‌ రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించింది. పోలీస్ అకాడమీ, మొయినాబాద్‌లో దాదాపు 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాలు ఒక్క ఇంచు కూడా కదలని పరిస్థితి. మరోవైపు ట్రాఫిక్‌లో స్కూల్ బస్సులు ఇరుక్కుపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఆఫీసులకు వెళ్లే ఉద్యోగస్తులు కూడా ట్రాఫిక్ జామ్‌తో అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

Revanth Reddy: నేటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన

Telangana: విపక్షాలు జేబులో.. లేదా జైల్లో ఉండాలి: కేటీఆర్

మరిన్ని తెలంగాణ వార్తల కోసం...

Updated Date - Apr 19 , 2024 | 01:52 PM