Share News

Lok Sabha Election 2024: 2024 లోక్‌సభ ఎన్నికల ఫేజ్1 ఓటింగ్ షూరూ.. ఎంత మంది పోటీ అంటే..

ABN , Publish Date - Apr 19 , 2024 | 09:39 AM

దేశంలో 2024 లోక్‌సభ ఎన్నికల మొదటి దశ(Lok Sabha Election 2024) ఓటింగ్ ఈరోజు(ఏప్రిల్ 19న) నుంచి మొదలైంది. ఈ దశలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఓటింగ్(voting) ఉదయం 7 గంటలకు మొదలు కాగా ఇది సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.

Lok Sabha Election 2024: 2024 లోక్‌సభ ఎన్నికల ఫేజ్1 ఓటింగ్ షూరూ.. ఎంత మంది పోటీ అంటే..
Lok Sabha Election 2024 Phase 1 Voting started

దేశంలో 2024 లోక్‌సభ ఎన్నికల మొదటి దశ(Lok Sabha Election 2024) ఓటింగ్ ఈరోజు(ఏప్రిల్ 19న) ఉదయం మొదలైంది. ఈ దశలో 21 రాష్ట్రాలు, పలు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఇందులో రాజస్థాన్‌లో 12, ఉత్తరప్రదేశ్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 6, బీహార్‌లో 4, పశ్చిమ బెంగాల్‌లో 3, అస్సాం, మహారాష్ట్రలో 5, మణిపూర్‌లో 2, త్రిపుర, జమ్మూలో ఒక్కో స్థానానికి ఓటింగ్ జరుగుతోంది. ఇది కాకుండా తమిళనాడు (39), మేఘాలయ (2), ఉత్తరాఖండ్ (5), అరుణాచల్ ప్రదేశ్ (2), అండమాన్ నికోబార్ దీవులు (1), మిజోరాం (1), నాగాలాండ్ (1), పుదుచ్చేరి (1), సిక్కిం ( 1) ), లక్షద్వీప్ (1) లోక్‌సభ స్థానాల్లో కూడా ఓటింగ్ జరుగుతోంది.


అయితే సీట్ల పరంగా ఇదే అతిపెద్ద దశ కావడం విశేషం. ఓటింగ్(voting) ఉదయం 7 గంటలకు మొదలు కాగా ఇది సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఇది కాకుండా అరుణాచల్ ప్రదేశ్‌లోని 60 అసెంబ్లీ స్థానాలకు గాను 50, సిక్కింలోని 32 అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ జరుగుతోంది. మార్చి 30న అరుణాచల్‌లో 10 మంది బీజేపీ అభ్యర్థులు ఏకపక్షంగా విజయం సాధించారు.


తొలి దశలో 1,625 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరిలో 1,491 మంది పురుషులు, 134 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. 8 మంది కేంద్ర మంత్రులు, మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కూడా ఈసారి ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ దశ తర్వాత రెండో దశ(second phase) పోలింగ్ ఏప్రిల్ 26న జరగనుంది. మొత్తం 7 దశల్లో 543 స్థానాలకు జూన్ 1న పోలింగ్ ముగియనుంది. జూన్ 4న అన్ని సీట్ల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ హిందీ, తమిళం, మరాఠీ సహా 5 భాషల్లో ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


ఇది కూడా చూడండి:

Mansoor Ali Khan: నటుడు మన్సూర్ అలీ ఖాన్‌కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..


Lok Sabha Polls: తమిళనాట పోటాపోటీ

మరిన్ని జాతీయ వార్తల కోసం

Updated Date - Apr 19 , 2024 | 10:01 AM