Share News

టార్గెట్‌ 100!

ABN , Publish Date - Apr 19 , 2024 | 04:18 AM

లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు పరాజయం పాలైన కాంగ్రెస్‌.. ఈసారి ఎలాగైనా పుంజుకోవాలని గట్టి పట్టుదలతో ఉంది. అందుకే విపక్షాలతో జట్టుకట్టి ‘ఇండియా’ కూటమిని ఏర్పాటు చేసుకుని.. వీలైనన్ని ఎక్కువ పార్టీలతో, ఎక్కువ రాష్ట్రాల్లో పొత్తు పెట్టుకుంది. అయితే శక్తిమంతమైన

టార్గెట్‌ 100!

లోక్‌సభలో బలం మూడంకెలకు చేరాలి

మళ్లీ విపక్షంలో కూర్చున్నా సరే..!!

కాంగ్రెస్‌ నాయకత్వం సంకల్పం?

లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు పరాజయం పాలైన కాంగ్రెస్‌.. ఈసారి ఎలాగైనా పుంజుకోవాలని గట్టి పట్టుదలతో ఉంది. అందుకే విపక్షాలతో జట్టుకట్టి ‘ఇండియా’ కూటమిని ఏర్పాటు చేసుకుని.. వీలైనన్ని ఎక్కువ పార్టీలతో, ఎక్కువ రాష్ట్రాల్లో పొత్తు పెట్టుకుంది. అయితే శక్తిమంతమైన బీజేపీని ఎదుర్కొని అధికారంలోకి రాగల బలం సాధించడం కష్టసాధ్యమని దానికీ తెలుసు. అందుకే 100 సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతిపక్షంలో కూర్చున్నా.. బలం మూడంకెలకు చేరితే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ద్విగుణీకృతమవుతుందని.. 2029 ఎన్నికలనాటికి పూర్తిగా పుంజుకోవడానికి, బీజేపీని ఓడించడానికి దోహదపడుతుందని ఏఐసీసీ పెద్దలు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు తాను 100 సీట్లు.. మిత్రపక్షాలు 130-140 స్థానాలు సాధించగలిగితే బీజేపీ బలం గణనీయంగా తగ్గిపోతుందని.. అత్తెసరు మెజారిటీతోనే గద్దెనెక్కుతుందని.. అప్పుడు పార్లమెంటులో గట్టిగా నిలదీయడానికి అవకాశం ఉంటుందని భావిస్తోంది. అయితే కాంగ్రెస్‌ దక్షిణ భారతంలో.. అందునా కర్ణాటక(28), తెలంగాణ(17)ల్లో మాత్రమే అధిక సీట్లు సాధించడానికి అవకాశం ఉంది. గత ఎన్నికల్లో కర్ణాటకలో ఒక్క సీటు, తెలంగాణలో 3 స్థానాలు గెలుచుకుంది. ఇప్పుడీ రెండు రాష్ట్రాల్లో ఆ పార్టీయే అధికారంలో ఉంది. ఈసారి తెలంగాణలో 8-10, కర్ణాటకలో 13-15 స్థానాలను టార్గెట్‌ చేసింది. కేరళ, తమిళనాడుల్లో పెరిగే అవకాశమే లేదు. ఎందుకంటే గత ఎన్నికల్లో కేరళలో మిత్రపక్షాలతో కలిసి 20కి గరిష్ఠంగా 19 చోట్ల గెలిచింది. తమిళనాడులో కూడా డీఎంకే తనకు కేటాయించిన 9 స్థానాల్లో 8 గెలుచుకుంది. ఈసారి కూడా అంతే. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కటీ రాకపోవచ్చని సర్వేలు చెబుతున్నాయి. ఇక హిందీ బెల్ట్‌ రాష్ట్రాల్లో గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ తుడిచిపెట్టుకుపోయింది. అందుకే ఆ పార్టీ ఈసారి మరీ ఎక్కువ సీట్లను ఆశించడం లేదు. యూపీ (80), మధ్యప్రదేశ్‌(29), ఛత్తీ స్‌గఢ్‌ (11), రాజస్థాన్‌(25), హరియాణా(10), హిమాచల్‌ ప్రదేశ్‌ (4), ఉత్తరాఖండ్‌ (5), ఢిల్లీ (7)లో కనీసం 15-20 సీట్లయినా దక్కించుకోవాలని, పంజాబ్‌(13)లో ఇప్పుడున్న 8 స్థానాలు నిలుపుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే తనకు బలమున్న కొన్ని స్థానాలపైనే శక్తియుక్తులన్నీ కేంద్రీకరిస్తోంది. యూపీలో సమాజ్‌వాదీతో జట్టుకట్టి 17 చోట్ల పోటీచేస్తోంది. గత ఎన్నికల్లో రాయ్‌బరేలీలో మాత్రమే.. అది కూడా కాంగ్రెస్‌ అగ్ర నేత సోనియాగాంధీ ఒక్కరే విజయం సాధించారు. కంచుకోట అమేఠీలో రాహుల్‌గాంధీ ఓడిపోయారు. ఈ దఫా సోనియా పోటీచేయడం లేదు. అమేఠీలో పోటీపై రాహుల్‌ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మహారాష్ట్ర (48)లో గత ఎన్నికల్లో కాంగ్రె్‌సకు ఒక్క సీటే వచ్చింది. ఈసారి ఉద్ధవ్‌ శివసేన, శరద్‌ పవార్‌ ఎన్‌సీపీతో జట్టుకట్టి 17 స్థానాల్లో పోటీచేస్తోంది. కనీసం పదైనా వస్తాయని ఆశిస్తోంది. గుజరాత్‌(25)లో ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)తో చేతులు కలపడం వల్ల 5 స్థానాల వరకు గెలుస్తామని అంచనా వేస్తోంది. ఢిల్లీలోనూ ఈ రెండు పార్టీలు కలిసి పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. ఈశాన్య భారతం, ఒడిసాలో కాంగ్రెస్‌కు పెద్దగా ఆశల్లేవు. పశ్చిమ బెంగాల్‌(42)లో ఇప్పుడున్న రెండు సీట్లకు మించి రాకపోవచ్చవెంకట్రామిరెడ్డిపై ని ఏఐసీసీ వర్గాలే భావిస్తున్నాయి. బిహార్‌(40)లో గత ఎన్నికల్లో ఆర్‌జేడీతో పొత్తుతో కాంగ్రెస్‌ ఒక్క స్థానంలోనే గెలిచింది. ఈ రెండూ ఈసారి లెఫ్ట్‌ పార్టీలతో జట్టుకట్టి బరిలోకి దిగుతున్నాయి. ఇక్కడ కాంగ్రె్‌సకు 3-5 సీట్లు రావచ్చని సర్వేలు చెబుతున్నాయి.

Updated Date - Apr 19 , 2024 | 04:18 AM