Share News

Harish Rao: ఆ నేతలు అందుకే పార్టీ మారుతున్నారు

ABN , Publish Date - Mar 29 , 2024 | 06:26 PM

లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు కష్టపడి పని చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. బీఆర్ఎస్ (BRS)అడ్డా... దుబ్బాక గడ్డా అని.. ఇక్కడ ఎన్నిక ఏదైనా ఎగిరేది గులాబీ జెండానేనని స్పష్టం చేశారు. శుక్రవారం నాడు మెదక్ పార్లమెంట్ ఎన్నికల బీఆర్ఎస్ సన్నాహక సమావేశం నిర్వహించారు.

Harish Rao:  ఆ నేతలు అందుకే పార్టీ మారుతున్నారు

సిద్దిపేట: లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు కష్టపడి పని చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. బీఆర్ఎస్ (BRS)అడ్డా... దుబ్బాక గడ్డా అని.. ఇక్కడ ఎన్నిక ఏదైనా ఎగిరేది గులాబీ జెండానేనని స్పష్టం చేశారు. శుక్రవారం నాడు మెదక్ పార్లమెంట్ ఎన్నికల బీఆర్ఎస్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హరీష్‌రావు, ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ... అందరికీ సుపరిచితులు మెదక్ జిల్లాలో ప్రతి గ్రామం తెలిసిన వ్యక్తి వెంకట్రామిరెడ్డి అని చెప్పారు. వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో ఎంపీగా గెలిపిద్దామని అన్నారు. బీజేపీ నేతలు విదేశాల్లో నల్లధనం తెచ్చి అందరికీ అకౌంట్‌‌లలో వేస్తామని చెప్పారని ఎందుకు వేయట్లేదని ప్రశ్నించారు. రాజకీయ స్వార్థంతో కొంతమంది నాయకులు పార్టీని వీడుతున్నారే తప్ప గ్రామ, మండల స్థాయి కార్యకర్తలు పార్టీని మారేందుకు ఇష్టపడట్లేదని హరీష్‌రావు చెప్పారు.

TG Politics: బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ .. కిషన్‌రెడ్డి సెటైర్లు


ఎవరైతే ఈ సమయంలో పార్టీ నుంచి బయటికి పోతున్నారో వాళ్లు మళ్లీ పార్టీలోకి వస్తామని తమ కాళ్లు మొక్కినా తిరిగి తీసుకోమని తేల్చిచెప్పారు. తమ పార్టీలోకి మధ్యలో వచ్చిన నేతలు మధ్యలోనే పోతున్నారని.. కానీ కార్యకర్తలు ఎల్లప్పుడూ తమతోనే ఉంటారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో సీఎం రేవంత్‌రెడ్డి ఎప్పుడూ కూడా అమరవీరులను గుర్తుకు తెచ్చుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. గ్లోబల్ ప్రచారం చేసి కాంగ్రెస్ నేతలు రాజ్యమేలుతున్నారని ఎద్దేవా చేశారు.పేగులు మెడలేసుకోవడం కాదని.. పేదల కోసం రేవంత్‌రెడ్డి పని చేయాలని హితవు పలికారు.

మెదక్ ఎంపీ స్థానం కచ్చితంగా తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఐదేళ్ల తర్వాత తెలంగాణలో వచ్చేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు. మెదక్‌లో కాంగ్రెస్ ఎంపీని గెలిపిస్తే సిద్దిపేట జిల్లా లేకుండా పోతుందనే వార్తలు వస్తున్నాయన్నారు. ఈ విషయంపై ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఉద్యమ స్ఫూర్తి ఉన్న గడ్డా దుబ్బాక అని చెప్పారు. రాజకీయ అవకాశ వాదులు, బ్రోకర్లు పార్టీని విడిచిపెట్టి పోతున్నారని విరుచుకుపడ్డారు. కష్టకాలంలో పార్టీ మారడం ఈ నేతలకు పద్దతేనా? అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి తమ నాయకులను కొంటున్నారు కానీ తమ కార్యకర్తలను మాత్రం కొనలేరని హరీశ్‌రావు హెచ్చరించారు.

KTR: వారిద్దరూ ఆస్కార్ నటుల కంటే ఎక్కువగా నటించారు.. కేటీఆర్ హాట్ కామెంట్స్

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 29 , 2024 | 07:04 PM