Share News

Hyderabad: ధాన్యం అమ్మిన రైతులకు రూ.10355 కోట్ల చెల్లింపులు

ABN , Publish Date - Jun 10 , 2024 | 03:41 AM

యాసంగి ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం కొత్త రికార్డు నెలకొల్పింది. ఇప్పటివరకు 8,35,109 మంది రైతులకు రూ. 10355.18 కోట్లు చెల్లింపులు చేసింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతులకు మూడు రోజుల్లోనే డబ్బులు చెల్లించింది.

Hyderabad: ధాన్యం అమ్మిన రైతులకు రూ.10355 కోట్ల చెల్లింపులు

  • యాసంగి వడ్ల కొనుగోళ్లలో రికార్డు

  • మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో జమ

  • రాష్ట్ర ప్రభుత్వం వెల్లడి

హైదరాబాద్‌, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): యాసంగి ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం కొత్త రికార్డు నెలకొల్పింది. ఇప్పటివరకు 8,35,109 మంది రైతులకు రూ. 10355.18 కోట్లు చెల్లింపులు చేసింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతులకు మూడు రోజుల్లోనే డబ్బులు చెల్లించింది. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం యాసంగి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. వివరాలిలా ఉన్నాయి. గతంలో ఏప్రిల్‌లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాగా, ఈసారి దాదాపు రెండు వారాలు ముందుగా మార్చి 25 నుంచే కొనుగోళ్లను మొదలుపెట్టింది.


యాసంగి సీజన్‌ ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సారి 7,178 కేంద్రాలను తెరిచింది. వీటిలో 6,345 కేంద్రాల్లో కొనుగోళ్లు జరిగాయి. ఈ నెల ఏడో తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 47.07 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. చాలా చోట్ల ఽకొనుగోళ్ల ప్రక్రియ పూర్తయిందని, మరో పది రోజుల పాటు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వచ్చే అవకాశముందని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ అంచనా వేస్తోంది.

Updated Date - Jun 10 , 2024 | 03:41 AM