Share News

Danam Nagender: కాంగ్రెస్‏కు 12 నుంచి 14 సీట్లు ఖాయం..

ABN , Publish Date - Apr 19 , 2024 | 08:45 AM

పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి 12 నుంచి 14 లోక్‌ సభ సీట్టు వస్తాయిన సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్‌(Danam Nagender) అన్నారు.

Danam Nagender: కాంగ్రెస్‏కు 12 నుంచి 14 సీట్లు ఖాయం..

- సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి దానం నాగేందర్‌

హైదరాబాద్: పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి 12 నుంచి 14 లోక్‌ సభ సీట్టు వస్తాయిన సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్‌(Danam Nagender) అన్నారు. బేగంపేటలోని పైగా ప్యాలెస్‏లో సనత్‌నగర్‌ కాంగ్రెస్‌ పార్టీ బూత్‌ స్థాయి కమిటీ విస్తృత సమావేశం నియోజకవర్గ ఇన్‌చార్జి డా. కోటనీలిమ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి దానం నాగేందర్‌, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌ హాజరైయ్యారు. ఈసందర్భంగా దానం మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి బీజేపీలో కలుస్తారనే విష ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలతో ప్రభుత్వానికి మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. సికింద్రాబాద్‌ పార్లమెంటు సీటును గెలిచి రాహుల్‌ గాంధీకి బహుమతిగా ఇస్తామని డా. కోటనీలిమ అన్నారు. ప్రతి బూత్‌లో మెజార్టీ వచ్చేలా కార్యకర్తలు కృషి చేయాలని అనిల్‌ కుమార్‌యాదవ్‌ అన్నారు. కార్యక్రమంలో నాయకులు ఫెరోజ్‌ఖాన్‌, డా. రవీందర్‌గౌడ్‌, విశాల్‌సుధాం, మునీర్‌ఖాన్‌, సలీంఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి: TG Politics: టికెట్ ఇస్తే బీజేపీలోకి వచ్చేస్తా.. కాంగ్రెస్ ఎంపీ ప్రతిపాదన!

కాంగ్రెస్‏లో చేరిన మర్రి శశిధర్‌రెడ్డి అనుచరుడు

బేగంపేట: బీజేపీ నేత మర్రి శశిధర్‌రెడ్డి ముఖ్య అనుచరుడు షేక్‌గౌస్‌ బీజేపీని వీడి సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్‌ సమక్షంలో గురువారం కాంగ్రెస్‌లో చేరారు. షేక్‌గౌస్‌కు దానం నాగేందర్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించా రు. 30సంవత్సరాలుగా మర్రి కుటుంబానికి విధేయుడి గా ఉన్న బేగంపేటకు చెందిన షేక్‌గౌస్‌ కాంగ్రెస్‌ పార్టీలో పలు పదవులు చేపట్టారు. మర్రికి నమ్మినబంటుగా ఉంటూ గెలుపోటముల్లో ఆయన వెంటే నడిచేవాడు. మర్రి శశిధర్‌రెడ్డితో పాటు షేక్‌గౌస్‌ కూడా బీజేపీలో చేరాడు. బీజేపీలో చేరిన నాటి నుంచి షేక్‌గౌస్‏కు బంధువులు, కుటుంబ సభ్యుల నుంచి వత్తిళ్లు అధికమవడంతో బీజేపీని వీడి దానం నాగేందర్‌ సమక్షంలో గురువారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

ఇదికూడా చదవండి: బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు బీఫాం

ప్రజల్లో ఉంటూ ప్రచారం చేయండి

బంజారాహిల్స్‌: ప్రజల్లో ఉంటూ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలపై ప్రచారం చేయాలని సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి దానం నాగేందర్‌ అన్నారు. బంజారాహిల్స్‌ క్యాంపు కార్యాలయంలో గురువారం పలు నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలు, నాయకులు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన కార్యక్రమా లు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూ చించారు. కేంద్ర మంత్రిగా కిషన్‌రెడ్డి ప్రజలకు అందుబాటులో లేడని, ఏ నియోజకవర్గానికి కూడా నిధులు కేటాయించలేదన్నారు. బీఆర్‌ఎస్‌ మీద కూడా ప్రజలు వ్యతిరేక దోరణితో ఉన్నారని, ఇలాంటి అవకాశాన్ని కాంగ్రెస్‌ సద్వినియోగపర్చుకోవాలన్నారు.

ఇదికూడా చదవండి: ప్రతీఒక్కరు ఎన్నికల నియమావళి పాటించాలి

Updated Date - Apr 19 , 2024 | 08:45 AM