Share News

Telangana: భీ ఫాంలు ఇస్తామంటూ.. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు సైబర్ నేరగాళ్ల ఝలక్..

ABN , Publish Date - Apr 03 , 2024 | 06:44 PM

ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ (Congress) ఎంపీ అభ్యర్థులకు సైబర్ నేరగాళ్లు ఝలక్ ఇచ్చారు. ఎన్నికలకు సంబంధించి పార్టీ ఆఫీసు నుంచి ఫోన్ చేస్తు న్నామంటూ ఫోన్లు రావడంతో అభ్యర్థులు ఒక్కసారిగా టెన్షన్ పడ్డారు.

Telangana: భీ ఫాంలు ఇస్తామంటూ.. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు సైబర్ నేరగాళ్ల ఝలక్..

ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ (Congress) ఎంపీ అభ్యర్థులకు సైబర్ నేరగాళ్లు ఝలక్ ఇచ్చారు. ఎన్నికలకు సంబంధించి పార్టీ ఆఫీసు నుంచి ఫోన్ చేస్తున్నామంటూ ఫోన్లు రావడంతో అభ్యర్థులు ఒక్కసారిగా టెన్షన్ పడ్డారు. ఫోన్ చేసి మీకు భీ ఫాంలు ఇస్తాం రూ.99వేలు చెల్లించి తీసుకోవాలని చెప్పడంతో నిజమని నమ్మారు. ఫోన్ పే నెంబర్‌కు డబ్బులు చెల్లించాలని అడగడంతో అనుమానంతో గాంధీ భవన్‌కు పోన్ చేసి అడగడంతో అసలు విషయం బయటపడింది. దీంతో గాంధీ భవన్ నుంచి ఎంపీ అభ్యర్థులకు ఫోన్లు చేసి ఢిల్లీ నుంచి పార్టీ ప్రతినిధులు ఎవరూ కాల్స్ చేయడం లేదని, ఎటువంటి డబ్బులు ఎవరికి చెల్లించవద్దని చెప్పారు.

Uttamkumar Reddy: లోక్‌సభ ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ పార్టీ మిగలదు..


అసలు ఏం జరిగిందంటే..

సైబర్ నేరగాళ్లు మొదట తెలంగాణ కాంగ్రెస్ కార్యాలయం గాంధీభవన్‌కు కాల్ చేశారు. ఏఐసీసీ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నామని.. పార్టీ అభ్యర్థుల వివరాలు వెంటనే ఇవ్వాలంటూ గాంధీ భవన్ సిబ్బందిని అడిగారు. ఎన్నికల టైమ్ కదా.. నిజంగానే ఎఐసీసీ కార్యాలయం నుంచి అడుగుతున్నారేమోనని, వెనుక, ముందు ఆలోచించకుండా వెంటనే పార్లమెంట్ అభ్యర్థుల వివరాలు అగంతుకులకు పంపించారు. డేటా పొందిన తరువాత.. అందులో ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి మీ బీ ఫాం సిద్ధంగా ఉంది.. రూ.99వేలు ఫోన్ పే చేయాలని అడిగారు. అవాక్కైన అభ్యర్థులు గాంధీ భవన్‌కు సమాచారం అందిచడంతో అసలు విషయం బయటపడింది. మొత్తానికి ఎవరూ డబ్బులు చెల్లించలేదు. దీంతో సైబర్ నేరగాళ్ల ప్లాన్ బెడిసి కొట్టింది.


ఎన్నికల వేళ

ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. కొందరు పార్టీ ఆఫీసు నుంచి ఫోన్ చేస్తున్నామని, మరికొందరు ఎన్నికల ప్రచారం కోసం సామాగ్రి పంపిస్తాం.. అడ్వాన్స్ చెల్లించాలంటూ ఫోన్లు చేసి మోసాలకు పాల్పడుతున్నారు. ఇటువంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.


TG Politics: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేది వారే.. హరీశ్‌రావు హాట్ కామెంట్స్

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 03 , 2024 | 06:44 PM