Share News

VH: ఫోన్ ట్యాపింగ్‌‌లో అసలు సూత్రధారులు ఎవరు?

ABN , Publish Date - Apr 02 , 2024 | 01:28 PM

Telangana: రాష్ట్రంలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ర్టంలో ఫోన్ ట్యాపింగ్‌లో ఎవరెవరు ఉన్నారో తెలియాలన్నారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరెవరు ఏం మాట్లాడుతూన్నారో రికార్డ్ చేసిందని ఆరోపించారు. ఇందులో ఇంకా చాలా అంశాలు బయటకు రావాలన్నారు. రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాన్‌ల ఫోన్లు ట్యాప్ చేశారన్నారు.

VH: ఫోన్ ట్యాపింగ్‌‌లో అసలు సూత్రధారులు ఎవరు?

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: రాష్ట్రంలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping Case) వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు (Congress Leader V.Hanumanth rao) స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ర్టంలో ఫోన్ ట్యాపింగ్‌లో ఎవరెవరు ఉన్నారో తెలియాలన్నారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government) ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో రికార్డ్ చేసిందని ఆరోపించారు. ఇందులో ఇంకా చాలా అంశాలు బయటకు రావాలన్నారు. రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాన్‌ల ఫోన్లు ట్యాప్ చేశారన్నారు. ఫోన్ ట్యాపింగ్‌లో అసలు సూత్రధారులు ఎవరు అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్‌లో ఇప్పటికే పలువురు అధికారులు అరెస్ట్ అయ్యారని కాంగ్రెస్ సీనియర్ నేత తెలిపారు.

Chandrababu: ఏపీ సీఎస్‌కు చంద్రబాబు ఫోన్... కారణమిదే!


నయీం అనే గ్యాంగ్ స్టర్ట్ గతంలో కోట్ల రూపాయలు, భూములు కాజేశారని... నయీం మరణం తర్వాత అక్కడ దొరికిన డబ్బులు ఏమయ్యాయని ప్రశ్నించారు. సిట్ అధికారిగా నాగిరెడ్డి ఉన్నారన్నారు. పేదల భూములు నయీం లాక్కున్నారని.. అవి ఏమయ్యాయని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వీటిపై విచారణ జరిపితే ఆ భూములను పేద ప్రజలకు ఇవ్వొచ్చని సూచించారు. నయీం డబ్బులు ఏమయ్యాయో ఎవరు చెప్పలేదన్నారు. ఫోన్ ట్యాపింగ్‌ను ప్రభుత్వం ఎలా సీరియస్‌గా తీసుకుందో .. నయీం డబ్బులు, ఆస్తులు ఏమయాయ్యో విచారణ జరపాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డిని ఇటీవల కలిశానని.. ఖమ్మం లోక్‌సభ సీటు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. రాజీవ్ గాంధీతో (RajivGandhi) అక్కడే తిరిగానని గుర్తుచేశారు. ఖమ్మం టికెట్ తనకిస్తే మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా.. దానికి కట్టుబడి ఉంటానని వీహెచ్ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి..

Bura Narasaiah Goud: బీఆర్ఎస్ డిల్లీ లో లేదు...గల్లీలో లేదు..

India - China: మీ ఇంటి పేరు మార్చితే అది నాది అవుతుందా.. చైనాకు జై శంకర్ కౌంటర్..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 02 , 2024 | 01:54 PM