Share News

CM Revanth Reddy: ఆ విషయంలో.. దేశంలోని రాజకీయ నాయకులందరిలో వెంకయ్య నాయుడే గ్రేట్..

ABN , Publish Date - Feb 04 , 2024 | 05:32 PM

తెలంగాణలోని ఐదుగురు కళాకారులకు పద్మశ్రీ అవార్డులను ప్రకటించడంతో కాంగ్రెస్ ప్రభుత్వం వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించింది. శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో వెంకయ్యనాయుడు, చిరంజీవిని ప్రభుత్వం ప్రత్యేకంగా సన్మానించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..

CM Revanth Reddy: ఆ విషయంలో.. దేశంలోని రాజకీయ నాయకులందరిలో వెంకయ్య నాయుడే గ్రేట్..

హైదరాబాద్: మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు తెలంగాణలోని ఐదుగురు కళాకారులకు పద్మశ్రీ అవార్డులను ప్రకటించడంతో కాంగ్రెస్ ప్రభుత్వం వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించింది. శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో వెంకయ్యనాయుడు, చిరంజీవిని ప్రభుత్వం ప్రత్యేకంగా సన్మానించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పద్మశ్రీ అవార్డు గ్రహీలను సన్మానించుకోవడంతో పాటూ రూ.25లక్షల నగదు బహుమతి, నెలకు రూ.25వేల పింక్షన్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అలాగే ఆయన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవిపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘వెంకయ్యనాయుడు నిలువెత్తు తెలుగు విగ్రహం. ఢిల్లీ వెళ్లే తెలుగు నేతలకు వెంకయ్య పెద్దదిక్కు. తెలుగు వారికి సన్మానం చేయడం నా బాధ్యత. వెంకయ్యను సన్మానించడం.. మనల్ని మనమే సన్మానించుకోవడం. నేను విద్యార్థి దశ నుంచి వెంకయ్య నాయుడు కుటుంబం మాకు బాగా తెలుసు. నా రాజకీయ ఎదుగుదల మొదటి నుంచీ ఆయన చూస్తూనే ఉన్నారు. వెంకయ్య నాయుడు, మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొదటి నుంచీ.. జంట కవుల తరహాలో పాలకుల మీద పదునైన భాషతో ప్రజా సమస్యలను లేవనెత్తి.. ప్రభుత్వ ఆలోచన విధానంలో మార్పు తెచ్చేవారు. అక్కడి నుంచి ఉప రాష్ట్రపతి వరకూ ఎదిగిన క్రమంలో అనేక దశల్లో వెంకయ్యనాయుడు చేపట్టిన పోరాటాలను తెలుగు వారితో పాటూ దేశ ప్రజలూ గమనించారు.

revanth-reddy-comments-on-c.jpg

‘‘దేశం నలుమూలల్లో రోడ్డుపై ప్రయాణం చేసి.. ఎక్కువ సభల్లో పాల్గొన్న నాయకుల్లో వెంకయ్య నాయుడు ముందు వరుసలో ఉంటారు. వారి జీవితంలో ఏరోజూ విశ్రాంతి తీసుకోకుండా ప్రజా సమస్యలపై పోరాటం సాగించారు. భవిష్యత్తులో వెంకయ్య నాయుడు.. రాష్ట్రపతి అవుతారని నేను కోరుకుంటున్నా. ప్రజల్లో ఉంటూ నిత్యం ప్రజా సమస్యల మీద ప్రజల తరఫున కొట్టాడితే.. గుర్తింపు, గౌరవం, హోదా అనేది ఆటోమేటిక్‌గా వస్తాయని వెంకయ్య నాయుడు గారు చెప్పారు. చిరంజీవి పున్నమినాగులో ఏ స్థాయిలో నటించారో.. సైరాలోనూ అదే స్థాయిలో నటించారు. చిరంజీవి 150కి పైగా సినిమాల్లో నటించి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినా ఇప్పటికీ ఎంతో కమిట్‌మెంట్‌తో ఉంటారు’’.. అంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Venkaiah Naidu: అందుకే.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు..!

Updated Date - Feb 04 , 2024 | 05:32 PM