Share News

BRS: గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్‌కు భారీ షాక్.. పార్టీని వీడిన కీలక నేత

ABN , Publish Date - Feb 08 , 2024 | 06:48 PM

డిసెంబర్‌లో వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇటీవల పలువురు బీఆర్‌ఎస్ నేతలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్‌లో చేరుతున్నారు.

BRS: గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్‌కు భారీ షాక్.. పార్టీని వీడిన కీలక నేత

హైదరాబాద్: డిసెంబర్‌లో వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇటీవల కాలంలో పలువురు బీఆర్‌ఎస్ నేతలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్‌లో చేరుతున్నారు. స్థానిక నేతల నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు ఈ వలసల పర్వం కొనసాగుతుండడం బీఆర్‌ఎస్‌ను కలవరపెడుతోంది. భవిష్యత్తులోనూ ఇది కొనసాగే అవకాశం ఉండడంతో బీఆర్‌ఎస్ పార్టీ అగ్ర నాయకత్వంలో కలవరం మొదలైంది. తాజాగా మరో కీలక నేత బీఆర్‌ఎస్‌ను వీడి హస్తం గూటికి చేరారు.


Fasiyaduddin-R.jpg

కారు దిగి కాంగ్రెస్‌లోకి..!

జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ దీపా మున్షీ సమక్షంలో బాబా ఫసియుద్దీన్ కాంగ్రెస్‌లో చేరారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరుపై బాబా ఫసియుద్దీన్ కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే ఉద్యమకారులకు పార్టీలో ప్రాధాన్యం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌తో ప్రాణహాని ఉందని చెప్పిన అధిష్టానం పట్టించుకోలేదంటూ బాబా చెప్పారు. కాగా ఇటీవల బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కూడా పార్టీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే.

రాజీనామా లేఖలో ఏముంది..?

Fasiyaduddin-Resing.jpg

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 08 , 2024 | 07:11 PM