Share News

Hyderabad: సీసీఎస్ ప్రక్షాళన!

ABN , Publish Date - May 26 , 2024 | 05:10 AM

ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు అరెస్టు చేసి జైలుకు తరలించడం సీసీఎ్‌సలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. రూ.1500 కోట్ల సాహితీ ఇన్‌ఫ్రా మోసం కేసులో కీలక విచారణాధికారిగా ఉన్న ఉమామహేశ్వరరావుపై అవినీతి ఆరోపణలు రావడం, ఆయనను అక్రమాస్తుల కేసులో ఏసీబీ అఽధికారులు అరెస్టు చేయడం తెలిసిందే.

Hyderabad: సీసీఎస్ ప్రక్షాళన!

  • సిద్ధమవుతున్న పోలీస్‌ ఉన్నతాధికారులు

  • ఆర్థిక నేరాలను అడ్డం పెట్టుకొని.. దండుకుంటున్న క్షేత్రస్థాయి సిబ్బంది

  • ఏసీపీ అరెస్టుతో అధికారుల అప్రమత్తం

  • నమోదైన కేసులు.. పురోగతిపై ఆరా

హైదరాబాద్‌ సిటీ, మే 25 (ఆంధ్రజ్యోతి): ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు అరెస్టు చేసి జైలుకు తరలించడం సీసీఎ్‌సలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. రూ.1500 కోట్ల సాహితీ ఇన్‌ఫ్రా మోసం కేసులో కీలక విచారణాధికారిగా ఉన్న ఉమామహేశ్వరరావుపై అవినీతి ఆరోపణలు రావడం, ఆయనను అక్రమాస్తుల కేసులో ఏసీబీ అఽధికారులు అరెస్టు చేయడం తెలిసిందే. ఆయన అరెస్టుతో ఇతర ఆర్థిక మోసం కేసులను డీల్‌ చేస్తున్న సిబ్బంది వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌లో కీలకంగా ఉన్న సీసీఎ్‌సలో అసలేం జరుగుతోందని పోలీస్‌ ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. సీసీఎ్‌సను ప్రక్షాళన చేయాలని వారు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.


ఇటీవలి కాలంలో నగరంలో ఆర్థిక మోసం కేసులు విపరీతంగా పెరిగిపోతుండడం, వేలాది మందిని ముంచేస్తున్న కేటుగాళ్లు రూ.వందల కోట్లు కొల్లగొట్టి ఉడాయిస్తుండడంతో.. ఈ కేసులన్నీ సీసీఎ్‌సలో నమోదవుతున్నాయి. వాటిని పరిశీలించి, బాధితుల గోడు వింటున్న సీసీఎస్‌ ఉన్నతాధికారులు ఆ కేసులను టీమ్‌ల వారీగా కేటాయించి, నేరస్థుల భరతం పట్టాలని ఆదేశిస్తున్నారు. అయితే కొంతమంది క్షేత్రస్థాయి సిబ్బంది.. ఆర్థిక మోసం కేసులను అడ్డం పెట్టుకొని నేరస్థులతో చేతులు కలుపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారి నుంచి అందినంత దండుకొని, కేసుల విచారణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, వాటి తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేయడం, లేదా మరోవిధంగా నిందితులకు కొమ్ముకాయడం వంటివి చేస్తున్నట్లు తెలుస్తోంది.


ఇలాంటి ఘటనలతో సీసీఎస్‌ ప్రతిష్ఠ మసకబారుతుండటంతో పోలీస్‌ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. గత కొన్ని నెలలుగా సీసీఎ్‌సలో నమోదైన కేసులు, విచారణలో ఆయా ఈవోడబ్ల్యూ, క్రైమ్‌ టీమ్‌లు సాధించిన పురోగతి, కొలిక్కి వచ్చిన కేసులు, వాటిలో నీరుగార్చిన కేసులు, ముడుపులు తీసుకొని తొక్కిపెట్టిన కేసులు, విచారణ సరిగా చేయకుండానే చార్జిషీట్‌ దాఖలు చేసిన కేసులపై కమిషనరేట్‌ ఉన్నతాఽధికారులు సమగ్ర దర్యాప్తు జరపనున్నట్లు తెలిసింది. పూర్తి ఆధారాలను సేకరించి, అధికారుల అవినీతి బాగోతాలపై అంతర్గత విచారణ జరిపాలని స్పెషల్‌ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఆ తర్వాత సిబ్బందిలో మార్పుతోపాటు.. భారీ ప్రక్షాళనకు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.

Updated Date - May 26 , 2024 | 05:10 AM