Share News

BRS: మేడ్చల్ జిల్లాలో బీఆర్ఎస్‌కు మరో షాక్

ABN , Publish Date - Apr 04 , 2024 | 10:11 AM

అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొచ్చాయి. ఒక పార్టీ పేకమేడలా కూలుతుంటే.. మరో పార్టీ మాత్రం అంతకంతకూ ఎదుగుతోంది. అవేంటనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మేడ్చల్ జిల్లాలో బీఆర్ఎస్‌కు మరో షాక్ తగిలింది. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ నీలా గోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నారు.

BRS: మేడ్చల్ జిల్లాలో బీఆర్ఎస్‌కు మరో షాక్

హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొచ్చాయి. ఒక పార్టీ పేకమేడలా కూలుతుంటే.. మరో పార్టీ మాత్రం అంతకంతకూ ఎదుగుతోంది. అవేంటనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మేడ్చల్ జిల్లాలో బీఆర్ఎస్‌ (BRS)కు మరో షాక్ తగిలింది. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ నీలా గోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నారు. మేయర్‌తో పాటు ఆరుగురు కార్పొరేటర్లు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇవాళ మధ్యాహ్నం గాంధీభవన్ లో దీపాదాస్ మున్షి సమక్షంలో చేరికలు ఉండనున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా మల్కాజ్‌గిరి పార్లమెంట్ ఇన్‌చార్జ్ మైనంపల్లి హనుమంతరావు చేరికల విషయంలో స్పీడ్ పెంచారు.

ట్యాపింగ్‌ జరిగి ఉంటే.. కేసీఆరే బాధ్యుడా?

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్‌ను వేగవంతం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతున్నాయి. బడా బడా నేతలు సైతం బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకుంటున్నారు. మేడ్చల్ జిల్లాపై మల్కాజ్‌గిరి పార్లమెంట్ ఇన్‌చార్జ్ మైనంపల్లి హనుమంతరావు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా అక్కడ మల్లారెడ్డి హవాను పూర్తిగా తగ్గించాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే చేరికలకు మరింత పదును పెట్టి అక్కడ బీఆర్ఎస్‌ను దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు.

రియాక్టర్లు బద్దలై శరీరాలు ఛిద్రమై

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Apr 04 , 2024 | 10:12 AM