Share News

Amit Shah: అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసు విచారణకు మరో ఢిల్లీ ఐపీఎస్ అధికారి

ABN , Publish Date - May 03 , 2024 | 10:59 AM

కేంద్ర హోం మంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసును ఢిల్లీ, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. నిన్నటి నుంచి ఢిల్లీ పోలీసుల బృందం హైదరాబాద్‌లోనే మకాం వేసింది. ఈ రోజు మరో ఢిల్లీ ఐపీఎస్ అధికారి హైదరాబాద్ చేరుకున్నారు. ఇప్పటికే మార్ఫింగ్ కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

Amit Shah: అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసు విచారణకు మరో ఢిల్లీ ఐపీఎస్ అధికారి
Amit Shah

హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) మార్ఫింగ్ వీడియో కేసును ఢిల్లీ, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. నిన్నటి నుంచి ఢిల్లీ పోలీసుల బృందం హైదరాబాద్‌లోనే మకాం వేసింది. ఈ రోజు మరో ఢిల్లీ ఐపీఎస్ అధికారి హైదరాబాద్ చేరుకున్నారు. ఇప్పటికే మార్ఫింగ్ కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ పోలీసుల అదుపులో ఉన్న వారిని అరెస్ట్ చేయాలని ఢిల్లీ పోలీసులు చూస్తున్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన ఐదుగురిని రాత్రంతా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు విచారించారు. ఫేక్ వీడియోకి సంబంధించిన కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు, పెన్ డ్రైవ్‌లను హైదరాబాద్ పోలీసులు సీజ్ చేశారు. అమిత్ షా ఫేక్ వీడియో క్రియేట్ చేసిన వారిని అరెస్ట్ చేసేందుకు ఢిల్లీ, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పోటీ పడుతున్నారు.

ఇది కూడా చదవండి:

IRCTC: తక్కువ బడ్జెట్‌లోనే.. షిర్డీ, శని శింగనాపూర్‌ ప్రయాణం


Heatwave: హీట్‌వేవ్ ఎఫెక్ట్..పెరుగుతున్న కూరగాయల ధరలు, ద్రవ్యోల్బణంపై కూడా

Read Latest National News and Telugu News

Updated Date - May 03 , 2024 | 10:59 AM