Share News

Apple: ప్రముఖ కంపెనీ యాపిల్‌పై కేసు.. రూ.9.4 లక్షల కోట్లు ఖతం

ABN , Publish Date - Mar 22 , 2024 | 01:11 PM

ప్రముఖ టెక్నాలజీ కంపెనీ యాపిల్‌(Apple)‌కు షాకింగ్ న్యూస్. అమెరికా ప్రభుత్వం ఇటివల ఈ సంస్థపై కేసు నమోదు చేసింది. మార్కెట్‌లో యాపిల్‌ అక్రమ గుత్తాధిపత్యాన్ని కొనసాగిస్తోందని అమెరికా ప్రభుత్వం(us government) ఆరోపించింది. దీంతో యాపిల్ సంస్థ షేర్లు పెద్ద ఎత్తున పడిపోయాయి.

Apple: ప్రముఖ కంపెనీ యాపిల్‌పై కేసు.. రూ.9.4 లక్షల కోట్లు ఖతం

ప్రముఖ టెక్నాలజీ కంపెనీ యాపిల్‌(Apple)‌కు షాకింగ్ న్యూస్. అమెరికా ప్రభుత్వం ఇటివల ఈ సంస్థపై కేసు నమోదు చేసింది. మార్కెట్‌లో యాపిల్‌ అక్రమ గుత్తాధిపత్యాన్ని కొనసాగిస్తోందని అమెరికా ప్రభుత్వం(us government) ఆరోపించింది. అంతేకాదు పోటీ కంపెనీలను మార్కెట్ నుంచి దూరంగా ఉంచడం, ధరలను నియంత్రించడం వంటి అంశాలను కూడా ప్రస్తావించింది. US ప్రభుత్వం యాపిల్‌పై యాంటీట్రస్ట్ చట్టాలను ఉల్లంఘించినందుకు కేసు నమోదు చేసింది. యుఎస్ జస్టిస్ డిపార్ట్‌మెంట్, 16 రాష్ట్ర అటార్నీ జనరల్‌లు గురువారం ఆపిల్‌పై యాంటీట్రస్ట్ దావా వేశారు. యూరప్‌లో ఈ కంపెనీ ప్రాంతం డిజిటల్ మార్కెట్ల చట్టానికి లోబడి ఉందా లేదా అనే దానిపై పరిశీలనను ఎదుర్కొంటోంది.

ఈ క్రమంలో యాపిల్ షేర్ ప్రైస్(share price) అమెరికా స్టాక్ మార్కెట్‌(stock market)లో భారీగా పడిపోయింది. గురువారం యాపిల్ కంపెనీ షేర్లు(appre company shares) 4.1 శాతం పడిపోయాయి. దీంతో ఒక్కరోజులోనే కంపెనీ మార్కెట్ విలువలో దాదాపు 113 బిలియన్ డాలర్ల(రూ.94 లక్షల కోట్లు) మేర క్షీణించింది. గత దశాబ్దంలో భారతదేశంలో యాపిల్ ఉత్పత్తి వేగంగా పెరిగింది. 2022-23లో 998 మిలియన్ డాలర్ల నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-డిసెంబర్ మధ్య స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు 3.53 బిలియన్ డాలర్లకు పెరిగాయి.


అయితే యాపిల్(apple) విచారణకు రావడం ఇదే మొదటిసారి కాదు. పోటీదారులను అణచివేసి తమకు లబ్ధి చేకూర్చుతున్నారనే ఆరోపణలను కంపెనీ, దానికి సంబంధించిన వ్యక్తులు అనేక ఏళ్లుగా ఎదుర్కొంటున్నారు అయినప్పటికీ యాపిల్ ఉత్పత్తులు మరింత ప్రాచుర్యం పొందాయి. Apple పోటీని నియంత్రించడానికి అనేక విధానాలను అనుసరించడం ద్వారా యాంటీట్రస్ట్ చట్టాలను ఉల్లంఘించిందని అమెరికా చెబుతోంది. ఇది డిజిటల్ వాలెట్ల వంటి దాని ఉత్పత్తులతో పోటీపడే అప్లికేషన్‌లను అందించకుండా ఇతర కంపెనీలను(companies) నిరోధించిందని అంటున్నారు.

Apple తన పరికరాలలో వినియోగదారుల అనుభవాన్ని కఠినంగా నియంత్రిస్తుందని విమర్శకులు(critics) తెలిపారు. పోటీదారుల కంటే తన స్వంత ఉత్పత్తులు(own products), సేవలకే ప్రాధాన్యతనిస్తుందని వెల్లడించారు. ఒకేసారి అనేక కేసులు వెలుగులోకి వస్తే, ఈ కంపెనీ నష్టాలను చవిచూడక తప్పదని యాంటీట్రస్ట్ ప్రొఫెసర్ బిల్ కోవాసిక్ అన్నారు. కంపెనీ ఈ కేసులో గెలిచినా, వారు ఇతర మార్గాల్లో ఓడిపోయే అవకాశం ఉందని వెల్లడించారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Whatsup: వాట్సప్ నుంచి మరో అదిరిపోయే ఫీచర్.. ఇకపై మీ వాయిస్‌ని చదవచ్చు

Updated Date - Mar 22 , 2024 | 01:12 PM