Share News

Whatsup: వాట్సప్ నుంచి మరో అదిరిపోయే ఫీచర్.. ఇకపై మీ వాయిస్‌ని చదవచ్చు

ABN , Publish Date - Mar 21 , 2024 | 07:36 PM

ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ WhatsApp ఆండ్రాయిడ్ యూజర్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో కొత్త ఫీచర్‌ తీసుకొచ్చే పనిలో ఉంది. అదే మన వాయిస్‌ని టెక్ట్స్ ఫార్మట్‌లోకి మార్చడం. ఈ ఫీచర్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్నట్లు తెలుస్తోంది.

Whatsup: వాట్సప్ నుంచి మరో అదిరిపోయే ఫీచర్.. ఇకపై మీ వాయిస్‌ని చదవచ్చు

ఇంటర్నెట్ డెస్క్: ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ WhatsApp ఆండ్రాయిడ్ యూజర్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో కొత్త ఫీచర్‌ తీసుకొచ్చే పనిలో ఉంది. అదే మన వాయిస్‌ని టెక్ట్స్ ఫార్మట్‌లోకి మార్చడం. ఈ ఫీచర్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం వాట్సప్ స్మార్ట్ ఫోన్‌లలో స్పీచ్ రికగ్నిషన్ ఫీచర్‌ను ఉపయోగించనుంది. ఫోన్లలో ఉన్న వాయిస్ రికార్డులను యాప్ ప్రాసెస్ చేస్తుంది. అనంతరం టెక్ట్స్ ఫార్మెట్‌లోకి మార్చుతుంది. ఆండ్రాయిడ్ 2.24.7.8 కోసం WhatsApp బీటా వర్షన్‌లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ఇది ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉండటంతో బీటా యూజర్లకు అందుబాటులోకి రాలేదు.

అయితే WABetaInfo ఒక స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసింది. ఈ ఫీచర్ విడుదల అయ్యాక ఎలా ఉంటుందో ఇందులో వివరించారు. ఆన్ డివైస్ స్పీచ్ రికగ్నిషన్ వినియోగం గురించి వాట్సాప్ వినియోగదారులకు తెలియజేస్తుంది. ఈ ఫీచర్ యూజర్ గోప్యతను నిర్ధారిస్తూ, మెసేజ్‌ల కోసం ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను కొనసాగిస్తూ వాయిస్ నోట్ ట్రాన్స్‌క్రిప్ట్‌లను అందించడానికి యాప్‌ను ఎనేబుల్ చేస్తుంది. అంతేకాకుండా మొబైల్ డేటా అందుబాటులో లేనప్పుడు కూడా అప్పటికే డౌన్‌లోడ్ అయిన వాయిస్ నోట్‌లను చూపిస్తుంది. వాట్సప్ 2023 మే నుంచి ఈ ఫీచర్‌ అభివృద్ధి కోసం ప్రయోగాలు చేస్తోంది. దీంతో వాయిస్ మెసేజ్‌లు టెక్ట్స్ ఫార్మట్‌లోకి మారతాయి. వాయిస్ సందేశం వినడానికి సాధ్యపడనప్పుడు ఇది ఉపయోగపడుతుంది.


నిమిషానికి స్టేటస్ ఫీచర్..

ప్రస్తుతం 30 సెకన్ల వాట్సాప్ స్టేటస్ ఫీచర్ ఉండగా, అది త్వరలో 60 సెకన్లకు పెంచుతాయని టెక్ వర్గాలు చెబుతున్నాయి. యాప్ బీటా వెర్షన్‌లో ఇప్పటికే పరీక్షిస్తున్నట్లు WABetaInfo వెల్లడించింది. దీంతో పొడవైన 60 సెకన్ల స్టేటస్ అప్‌డేట్‌లను యాక్సెస్ చేయడానికి వినియోగదారులకు అవకాశం ఉంటుందని తెలిపింది. అందుకోసం కొత్త వాట్సాప్ బీటా వెర్షన్‌ను కూడా ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుందని చెప్పింది. అయితే ఈ ఫీచర్(feature) మరికొన్ని వారాల్లో వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ వీడియోలను వీక్షించడానికి వినియోగదారులు వాట్సాప్‌ను అప్‌డేట్ చేయాల్సి ఉంటుందని వెల్లడించింది. ఈ సౌకర్యాన్ని వినియోగదారుల ఇష్టం ప్రకారం ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ స్టేటస్ వీడియోల సమయాన్ని పెంచాలని అనేక మంది నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు సులభంగా QR చెల్లింపులను సులభతరం చేయడానికి కూడా వాట్సాప్ కృషి చేస్తోంది.

మెసేజింగ్ యాప్ మీ QR కోడ్‌ను చాట్‌ల ట్యాబ్ నుంచి నేరుగా షేర్ చేయడానికి మిమ్మల్ని అనుమతించనుంది. మీరు దీన్ని చేయడానికి సెట్టింగ్‌లకు వెళ్లాలి. కొత్త అప్‌డేట్‌తో ఇది మరింత సరళంగా ఉంటుంది. దీనికి అదనంగా మీరు మీ QR కోడ్‌ను షేర్ చేసినప్పుడు WhatsApp మీ ఫోన్ నంబర్‌కు బదులుగా మీ వినియోగదారు పేరును ప్రదర్శిస్తుంది. ఈ ఫీచర్ కూడా మరికొన్ని రోజుల్లో అమల్లోకి రానుంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 21 , 2024 | 07:38 PM