Share News

Hyderabad: లావణ్య ఎవరు...? హైదరాబాద్ ఎందుకు వచ్చింది..? హీరోకు లవర్‌గా ఎలా మారింది..?

ABN , Publish Date - Jan 30 , 2024 | 01:38 PM

నార్సింగి లావణ్య డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెల్లడయ్యాయి. విజయవాడ నుంచి ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వచ్చిన లావణ్య జల్సాలకు అలవాటు పడింది.

Hyderabad: లావణ్య ఎవరు...? హైదరాబాద్ ఎందుకు వచ్చింది..? హీరోకు లవర్‌గా ఎలా మారింది..?

నార్సింగి లావణ్య డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెల్లడయ్యాయి. విజయవాడ నుంచి ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వచ్చిన లావణ్య జల్సాలకు అలవాటు పడింది. టాలీవుడ్ లో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ మ్యూజిక్ టీచర్ గా పని చేసింది. చిన్న సినిమాల్లో నటించింది. పలు సినిమాల్లో హీరోయిన్ గా యాక్ట్ చేసింది. ఒక హీరోకు పరిచయమై లవర్ గా మారింది. వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో అనుమానితురాలుగా ఉంది. కొంతకాలంగా లావణ్య ఉనిత్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. చిత్ర పరిశ్రమలో పలువురికి డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తు్న్నారు. లావణ్య సోషల్ మీడియా అకౌంట్ లతో పాటు వ్యక్తిగత చాట్ ని పరిశీలించనున్నారు. లావణ్యకు చాలామంది వీఐపీలతో పరిచయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కోర్టు అనుమతితో లావణ్యను కస్టడీలోకి తీసుకుంటామని పోలీసులు వివరించారు.

ఈ కేసు మొత్తం లావణ్య చుట్టూ తిరుగుతోందని సమాచారం. కొంతమంది సింగర్లు, సినీ పరిశ్రమకు చెందిన కొందరు వ్యక్తులు ఆమెకు కాంటాక్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. కోకాపేటలోని ఓ విల్లాలో నివాసం ఉంటున్న లావణ్య దగ్గర లభించిన డ్రగ్స్‌పై ఆరా తీస్తున్నారు. తన కోసమే తీసుకొచ్చిందా లేక ఎవరికైనా అమ్మడానికా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. లావణ్య చిత్ర పరిశ్రమలో పలువురికి డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.


అయితే లావణ్య మొబైల్ డేటాలో పలువురు ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. సైబరాబాద్ పోలీసులు రహస్యంగా విచారణ జరుపుతున్నారు. మరోవైపు నార్కొటిక్ బ్యూరో అధికారులు సైతం ఆరా తీస్తున్నారు. డ్రగ్స్ దందాలో ఎవరెవరు ఉన్నారన్న విషయాలను తెలుసుకుంటున్నారు. ఈ కేసులో ఇవాళ కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్న నార్సింగి పోలీసులు.. మరింత లోతుగా విచారణ జరిపేందుకు సిద్ధమవుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 30 , 2024 | 01:46 PM