Share News

Google: గూగుల్‌లో కొత్త ఫీచర్.. ఇకపై సర్కిల్ చేసి సర్చ్ చేయొచ్చు

ABN , Publish Date - Apr 22 , 2024 | 09:47 AM

దిగ్గజ కంపెనీ గూగుల్ సరికొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తెచ్చింది. ఇకపై గూగుల్‌లో ఏదైనా ఈజీగా సర్చ్ చేయొచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్‌లలో సెర్చ్ చెయ్యడానికి సర్కిల్ టు సెర్చ్ (Circle to search) అనే కొత్త ఫీచర్‌ను ప్రారంభించింది.

Google: గూగుల్‌లో కొత్త ఫీచర్.. ఇకపై సర్కిల్ చేసి సర్చ్ చేయొచ్చు

ఇంటర్నెట్ డెస్క్: దిగ్గజ కంపెనీ గూగుల్ సరికొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తెచ్చింది. ఇకపై గూగుల్‌లో ఏదైనా ఈజీగా సర్చ్ చేయొచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్‌లలో సెర్చ్ చెయ్యడానికి సర్కిల్ టు సెర్చ్ (Circle to search) అనే కొత్త ఫీచర్‌ను ప్రారంభించింది. దీని ద్వారా 2 లాభాలు ఉన్నాయి. మనం ఏం సెర్చ్ చెయ్యాలనుకుంటున్నామో దాన్ని ఈజీగా వెతకవచ్చు.


అలాగే మాతృ భాషలో సదరు వస్తువు సమాచారం పొందే వీలు ఉంది. తద్వారా సెర్చ్ విషయంలో భాష సమస్య రాదు. ప్రజలు సెర్చ్ చెయ్యడానికి ఈజీగా ఉండేలా గూగుల్(Google) అనేక మార్పులు చేస్తోంది. ఈ కొత్త ఫీచర్‌ ఎలా ఉంటుందో ఉదాహరణతో తెలుసుకుందాం. ఏదైనా వస్తువు ఫొటో తీసి దాని గురించి తెలుసుకోవాలనుకుంటాం.


దాని ఫొటోపై చుట్టూ సర్కిల్ గీస్తే వస్తువేంటో, అది ఎక్కడ లభిస్తుంది, ధర తదితర వివరాలు వచ్చేస్తాయి. సర్కిల్‌తో పాటు కోన్ సెర్చ్ కూడా ఉంది. ఓ కట్టడం ఫొటోపై గీతలు గీసి సెర్చ్ చేస్తే.. వెంటనే కట్టడం వివరాలు వచ్చేస్తాయి. గూగుల్‌లో మరో ఫీచర్ కూడా ఉంది. ఏదైనా దృశ్యంపై అడ్డంగా ఓ గీత గీస్తే చాలు దాని వివరాలు వచ్చేస్తాయి.

Viral Video: లైవ్‌లో వార్తలు చదువుతూ స్పృహ తప్పిన దూరదర్శన్ యాంకర్.. ఎంతకీ కళ్లు తెరవకపోవడంతో


ఇలా నచ్చిన విధంగా సర్చ్ చేసినా.. గూగుల్ వాటికి సర్చ్ రిసల్ట్ ఇస్తుంది. ప్రస్తుతం ఇది ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. అన్ని ఫోన్లూ ఈ ఫీచర్‌ని పొందలేవు. ఈ ఫీచర్‌ని అందరు వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు గూగుల్ శ్రమిస్తోంది. కొత్త ఫీచర్‌లను జోడించడం ద్వారా, సర్కిల్ టు సెర్చ్ మరింత సమర్థవంతంగా, యూజర్ ఫ్రెండ్లీగా మారుతుంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 22 , 2024 | 09:47 AM