Share News

Viral Video: లైవ్‌లో వార్తలు చదువుతూ స్పృహ తప్పిన దూరదర్శన్ యాంకర్.. ఎంతకీ కళ్లు తెరవకపోవడంతో

ABN , Publish Date - Apr 21 , 2024 | 08:37 PM

దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. మనుషులతో పాటు మూగ జీవులు సైతం అల్లాడుతున్నాయి. కొన్ని చోట్ల నీరు దొరక్కా జంతువులు మృత్యువాత పడుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడంతో బీపీ పెరిగి ఓ యాంకర్ స్పృహ కోల్పోయారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లో(West Bengal) జరిగింది. పాముద్ర సిన్హా దూరదర్శన్‌లో యాంకర్‌గా పని చేస్తున్నారు.

Viral Video: లైవ్‌లో వార్తలు చదువుతూ స్పృహ తప్పిన దూరదర్శన్ యాంకర్.. ఎంతకీ కళ్లు తెరవకపోవడంతో

కోల్‌కతా: దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. మనుషులతో పాటు మూగ జీవులు సైతం అల్లాడుతున్నాయి. కొన్ని చోట్ల నీరు దొరక్కా జంతువులు మృత్యువాత పడుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడంతో బీపీ పెరిగి ఓ యాంకర్ స్పృహ కోల్పోయారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లో(West Bengal) జరిగింది.

పాముద్ర సిన్హా దూరదర్శన్‌లో యాంకర్‌గా పని చేస్తున్నారు. ఆమె ఈ మధ్య తరచూ అనారోగ్యంబారిన పడుతున్నారు. ఈ క్రమంలో ఆమె ఆరోగ్యం బాలేకపోవడానికి తోడు.. ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో ఆమె డీహైడ్రేషన్ బారిన పడారు. నీళ్లు తాగి వార్తలు చదవాలని భావించారు. లైవ్‌లో వార్తలు చదువుతుండగా మధ్యలో నీరు తాగే అవకాశం లేకపోవడంతో ఆమె కళ్లు మసకబారాయి.


టెలిప్రాంప్టర్‌ని చూడలేకపోయారు. దీంతో అక్కడే ఉన్న కుర్చీలో కుప్పకూలారు. గమనించిన ఛానల్ సిబ్బంది నీళ్లు కొట్టి ఆమెను మేల్కొల్పడానికి ప్రయత్నించారు. చాలా సేపటి తరువాత ఆమె కళ్లు తెరిచేసరికి ఆసుపత్రికి తరలించారు. పాముద్ర సిన్హా ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఫేస్‌బుక్ లైవ్‌లో వెల్లడించారు.

పశ్చిమ బెంగాల్‌లో ఎండల తీవ్రత ఎలా ఉందో చెప్పడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ అని.. ఆమె వీడియోలో వివరించారు. దేశ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. చాలా చోట్ల వడగాల్పులు వీస్తున్నాయి. వేసవి కాలంలో జాగ్రత్తలు పాటించాలని, తరచూ శీతల పానీయాలు తాగాలని శరీరంలో అకస్మాత్తుగా ఏమైనా మార్పులు జరిగితే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 21 , 2024 | 09:16 PM