Share News

Yuvraj Singh: హైదరాబాద్ ప్లేయర్ అభిషేక్‌ని బూతులు తిట్టిన యువరాజ్.. కారణం ఇదే!

ABN , Publish Date - Mar 28 , 2024 | 06:20 PM

అభిషేక్ ఎంతో అద్భుతమైన ఆటతీరు కనబరిచాడని, అతని మెరుపు ఇన్నింగ్స్ ఐపీఎల్ చరిత్రలోనే ఓ మైలురాయిగా నిలిచిపోతుందని అందరూ కొనియాడుతున్నారు. కానీ.. భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ మాత్రం అభిషేక్‌ని బూతులు తిట్టాడు. నిన్ను కొట్టేందుకు నా దగ్గర చెప్పు సిద్ధంగా ఉందంటూ కుండబద్దలు కొట్టాడు.

Yuvraj Singh: హైదరాబాద్ ప్లేయర్ అభిషేక్‌ని బూతులు తిట్టిన యువరాజ్.. కారణం ఇదే!

సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ఆటగాడు అభిషేక్ శర్మ (Abhishek Sharma) బుధవారం (27/03/24) ముంబై ఇండియన్స్‌తో (Mumbai Indians) జరిగిన మ్యాచ్‌లో ఎలా చెలరేగి ఆడాడో అందరికీ తెలుసు. కేవలం 16 బంతుల్లోనే అర్థశతకం చేసి, ఐపీఎల్ (IPL) చరిత్రలోనే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డ్‌ని నమోదు చేశాడు. ఓవరాల్‌గా 23 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్ల సహకారంతో 63 పరుగులు చేసిన అతను.. హైదరాబాద్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే అతనికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ (Man Of The Match) అవార్డ్ లభించింది. అంతేకాదు.. సర్వత్రా అతనిపై ప్రశంసలు కూడా వచ్చిపడుతున్నాయి. అభిషేక్ ఎంతో అద్భుతమైన ఆటతీరు కనబరిచాడని, అతని మెరుపు ఇన్నింగ్స్ ఐపీఎల్ చరిత్రలోనే ఓ మైలురాయిగా నిలిచిపోతుందని అందరూ కొనియాడుతున్నారు.

Kejriwal Arrest: ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు ఊరట.. ఆ పిటిషన్ తిరస్కరణ


కానీ.. భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) మాత్రం అభిషేక్‌ని బూతులు తిట్టాడు. నిన్ను కొట్టేందుకు నా దగ్గర చెప్పు సిద్ధంగా ఉందంటూ కుండబద్దలు కొట్టాడు. యువరాజ్ ఇలా అనడానికి కారణం.. అభిషేక్ ఔట్ అయిన విధానం నచ్చకపోవడం వల్లే! భారీ షాట్లతో ఊచకోత కోసిన అభిషేక్.. మరో షాట్‌కి ప్రయత్నించి, క్యాచ్ ఔట్ అయ్యాడు. పియుష్ చావ్లా బౌలింగ్‌లో గట్టిగా కొట్టబోగా.. బంతి పైకి లేచి, బౌండరీ లైన్ వద్ద ఉన్న ఫీల్డర్ చేతికి చిక్కింది. దీనిని ఓ చెత్త షాట్‌గా యువరాజ్ అభివర్ణిస్తూ.. ఎవరైనా ఇలా ఔట్ అవుతారా? అని మండిపడ్డాడు. ‘వాహ్ అభిషేక్ వాహ్.. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడావు కానీ, ఆ ఔటైనా విధానం ఏంటి? ఎవరైనా అలాంటి షాట్ కొడతాడా? మాటలతో చెప్తే వినవు. నిన్ను కొట్టేందుకు స్పెషల్ చెప్పు వేచి చూస్తోంది’’ అంటూ ఎక్స్ వేదికగా రాసుకొచ్చాడు. అన్నట్టు మరో విషయం.. అభిషేక్‌కి యువరాజ్ గురువు. ప్రత్యేక్షంగా అందుబాటులో లేడు కాబట్టి.. ఎక్స్ వేదికగా ఇలా తన శిష్యుడికి క్లాస్ పీకాడన్నమాట!

Mumbai Indians: ముంబై ఇండియన్స్ రెండో ఓటమి తర్వాత కీలక పరిణామం.. రోహిత్ శర్మతో ఆకాశ్ అంబాని చర్చలు

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. అభిషేక్ శర్మ (63)తో పాటు ట్రావిస్ హెడ్ (62) (Travis Head), హెన్రిచ్ క్లాసెన్ (80) (Heinrich Klaasen) విధ్వంసకరంగా ఆడటం వల్ల హైదరాబాద్ జట్టు మూడు వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. మార్క్‌రమ్ (42) కూడా మెరుగ్గానే రాణించాడు. లక్ష్య ఛేదనలో భాగంగా.. ముంబై ఇండియన్స్ జట్టు కూడా గట్టిగానే ప్రయత్నించింది. క్రీజులోకి వచ్చిన ప్రతి ఆటగాడు చెలరేగి ఆడాడు. ముంబై దూకుడు చూసి.. లక్ష్యాన్ని ఛేధిస్తారేమో? అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. చివరికి ముంబై టీమ్ 5 వికెట్ల నష్టానికి 246 పరుగులకే పరిమితం కావడంతో.. 31 పరుగుల తేడాతో హైదరాబాద్ ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే భారీ విజయాన్ని సొంతం చేసుకోగలిగింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 28 , 2024 | 06:36 PM