Share News

Mumbai Indians: ముంబై ఇండియన్స్ రెండో ఓటమి తర్వాత కీలక పరిణామం.. రోహిత్ శర్మతో ఆకాశ్ అంబాని చర్చలు

ABN , Publish Date - Mar 28 , 2024 | 05:08 PM

క్రికెట్‌లో ఏదైనా ఒక జట్టు ఓటమి పాలైనప్పుడు.. దాని పరిణామాలపై ఆయా జట్టు కోచ్‌లు కెప్టెన్‌తో చర్చలు జరపడాన్ని మనం తరచూ చూస్తూ ఉంటాం. కానీ.. బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ముంబై ఇండియన్స్ ఓటమి పాలయ్యాక అందుకు భిన్నమైన దృశ్యం కనిపించింది. ముంబై జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో ఆ జట్టు యజమాని ఆకాశ్ అంబాని కాసేపు చర్చించుకున్నారు.

Mumbai Indians: ముంబై ఇండియన్స్ రెండో ఓటమి తర్వాత కీలక పరిణామం.. రోహిత్ శర్మతో ఆకాశ్ అంబాని చర్చలు

క్రికెట్‌లో ఏదైనా ఒక జట్టు ఓటమి పాలైనప్పుడు.. దాని పరిణామాలపై ఆయా జట్టు కోచ్‌లు కెప్టెన్‌తో చర్చలు జరపడాన్ని మనం తరచూ చూస్తూ ఉంటాం. కానీ.. బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) చేతిలో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఓటమి పాలయ్యాక అందుకు భిన్నమైన దృశ్యం కనిపించింది. ముంబై జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో (Rohit Sharma) ఆ జట్టు యజమాని ఆకాశ్ అంబాని (Akash Ambani) కాసేపు చర్చించుకున్నారు. మొదట్లో వీరి సంభాషణ సందర్భంగా తిలక్ వర్మతో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నారు. అనంతరం వాళ్లిద్దరు వెళ్లిపోగా.. రోహిత్, ఆకాశ్ డగౌట్ నుంచి కొంత దూరం వచ్చి ఇంకాసేపు చర్చించారు. ఫైనల్‌గా హార్దిక్ పాండ్యా (Hardik Pandya) చేరడంతో.. ముగ్గురు కలిసి కాసేపు ఓటమిపై సంభాషించారు.

SRH vs MI: ముంబై, సన్‌రైజర్స్ మ్యాచ్‌లో కావ్య మారన్ సెలబ్రేషన్స్ వైరల్.. ఫోకస్ మొత్తం ఆమెపైనే!


ఈ ముగ్గురి మధ్య.. ముఖ్యంగా రోహిత్, ఆకాశ్ మధ్య ఎలాంటి సంభాషణ జరిగిందో తెలీదు కానీ.. ఈ పరిణామం మాత్రం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సీజన్‌లో హార్దిక్ పాండ్యా నాయకత్వంలో ముంబై జట్టు రెండుసార్లు ఓటమిపాలవ్వడం, ముఖ్యంగా హైదరాబాద్ జట్టు చేతిలో ఘోర పరాజయం చవిచూసిన నేపథ్యంలో.. కెప్టెన్సీ బాధ్యతలను తిరిగి రోహిత్ శర్మకు అప్పగించాలన్న విషయంపై ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ పునరాలోచనలు చేస్తుండొచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 11 సంవత్సరాల పాటు ముంబైకి రోహిత్ నాయకత్వం వహించడం, ఐదు టైటిళ్లు తెచ్చిపెట్టిన చరిత్ర కలిగి ఉండటంతో.. రోహిత్‌ని తిరిగి కెప్టెన్‌గా నియమించడంపై కసరత్తులు చేస్తుండొచ్చని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) చేతిలో ఓడిపోయినప్పుడు సైతం.. రోహిత్, బుమ్రా ఇతర జట్టు సభ్యులు డగౌట్‌లో కనిపించడం.. ఆ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోస్తోంది.

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు మరో షాక్.. ఏప్రిల్ 1వ తేదీ వరకు కస్టడీ పొడిగింపు

అయితే.. ఈ విషయంపై ఇప్పుడే ఓ నిర్ణయానికి రావడం కరెక్ట్ కాదని క్రీడా నిపుణులు చెప్తున్నారు. రోహిత్‌కు ఉన్న అనుభవం దృష్ట్యా.. అతని నుంచి సలహాలు తీసుకునే ఉద్దేశంతో ఆకాశ్ అతనితో చర్చలు జరిపి ఉండొచ్చని, కెప్టెన్సీ మార్పు ఉండకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమేనని, అందుకు ఒక్క కెప్టెన్‌ని నిందించడం కరెక్ట్ కాదని పేర్కొంటున్నారు. ఏదేమైనా.. డగౌట్‌లో రోహిత్‌తో కలిసి ఆకాశ్ అంబాని జరిపిన భేటీ మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మరి, భవిష్యత్తులో ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 277 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో భాగంగా.. ముంబై జట్టు 246 పరుగులు చేసి, 31 పరుగులతో ఓటమి పాలైంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 28 , 2024 | 05:12 PM