Share News

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు మరో షాక్.. ఏప్రిల్ 1వ తేదీ వరకు కస్టడీ పొడిగింపు

ABN , Publish Date - Mar 28 , 2024 | 04:03 PM

మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మరో షాక్ తగిలింది. మరో నాలుగు రోజుల పాటు.. అంటే ఏప్రిల్ 1వ తేదీ వరకూ కేజ్రీవాల్ కస్టడీని పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. స్పెషల్ కోర్ట్ జడ్జి కావేరి బవేజా ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు.

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు మరో షాక్.. ఏప్రిల్ 1వ తేదీ వరకు కస్టడీ పొడిగింపు

మద్యం కుంభకోణానికి (Delhi Liquor Scam) సంబంధించిన మనీలాండరింగ్ కేసులో (Money Laundering Case) అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు (Arvind Kejriwal) మరో షాక్ తగిలింది. మరో నాలుగు రోజుల పాటు.. అంటే ఏప్రిల్ 1వ తేదీ వరకూ కేజ్రీవాల్ కస్టడీని పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. స్పెషల్ కోర్ట్ జడ్జి కావేరి బవేజా ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. మరోవైపు.. తన అరెస్ట్ వెనుక రాజకీయ కుట్ర (Political Conspiracy) ఉందని కేజ్రీవాల్ ఆరోపించారు. తన అరెస్ట్ ఒక రాజకీయ కుట్ర అని, రాబోయే ఎన్నికల్లో దీనికి ప్రజలే సమాధానం చెప్తారని అన్నారు. కాగా.. కేజ్రీవాల్‌ని కోర్టులో హాజరుపరిచినప్పుడు ఆప్ మంత్రులు అతిషి, గోపాల్ రాయ్, సౌరభ్ భరద్వాజ్‌తో పాటు ముఖ్యమంత్రి సతీమణి సునీత కేజ్రీవాల్ కోర్టులో ఉన్నారు.

Kejriwal Arrest: ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు ఊరట.. ఆ పిటిషన్ తిరస్కరణ


కాగా.. కేజ్రీవాల్‌ను (Kejriwal Arrest) మార్చి 21వ తేదీన అరెస్ట్ చేయగా, 28వ తేదీ వరకు ఆయన ఈడీ కస్టడీలో ఉన్నారు. తనని అరెస్ట్ చేశాక.. ఈడీ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో (Delhi High Court) పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ తనని అక్రమంగా అరెస్ట్ చేసిందని, తక్షణమే ఉపశమనం కలిగించాలని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే.. ఢిల్లీ హైకోర్టు ఆయనకు మధ్యంతరం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అందుకు బదులుగా.. కేజ్రీవాల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా న్యాయస్థానం ఈడీకి ఏప్రిల్ 2వ తేదీ వరకు సమయం ఇచ్చింది. ఏదేమైనా.. ఓ విషయంలో మాత్రం కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ను ముఖ్యమంత్రిగా తొలగించాలని దాఖలైన పిటిషన్‌ను కొట్టివేస్తూ.. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని స్పష్టం చేసింది. అంతేకాదు.. న్యాయపరంగా ఉన్న అడ్డంకులు ఏంటని పిటిషనర్‌ను ప్రశ్నించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Updated Date - Mar 28 , 2024 | 04:05 PM