Share News

Kohli: ఐపీఎల్‌లో కింగ్ కోహ్లి రికార్డ్.. ఏంటంటే..?

ABN , Publish Date - May 22 , 2024 | 09:07 PM

కింగ్ కోహ్లి మరో కొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇప్పటికే పలు రికార్డులు నెలకొల్పన రన్ మెషీన్.. తాజాగా మరో ఫీట్ సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అత్యధిక పరుగులు సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. కోహ్లి తప్ప మరే ప్లేయర్ ఇప్పటివరకు ఆ దరిదాపుల్లో ఎవరూ లేరు. ఐపీఎల్‌ రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్‌- ఆర్సీబీ మధ్య జరుగుతోంది. ఓపెనర్ కోహ్లి 33 పరుగులు చేసి వెనుదిరిగాడు.

Kohli: ఐపీఎల్‌లో కింగ్ కోహ్లి రికార్డ్.. ఏంటంటే..?
Virat Kohli

కింగ్ కోహ్లి మరో కొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇప్పటికే పలు రికార్డులు నెలకొల్పన రన్ మెషీన్.. తాజాగా మరో ఫీట్ సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అత్యధిక పరుగులు సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. కోహ్లి తప్ప మరే ప్లేయర్ ఇప్పటివరకు ఆ దరిదాపుల్లో ఎవరూ లేరు. ఐపీఎల్‌ రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్‌- ఆర్సీబీ మధ్య జరుగుతోంది. ఓపెనర్ కోహ్లి 33 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఐపీఎల్‌లో 8 వేల పరుగులను పూర్తి చేశాడు. ఐపీఎల్‌లో 8 సెంచరీలు కూడా చేశాడు. 55 హాఫ్ సెంచరీలు చేసి దుమ్ముదులిపాడు కోహ్లి. ఐపీఎల్‌‌లో పరుగుల పరంగా కోహ్లి తర్వాత స్థానంలో శిఖర్ ధావన్ ఉన్నాడు. శిఖర్ 6769 పరుగులు చేశాడు.

Updated Date - May 22 , 2024 | 09:07 PM