Share News

Shubman Gill: నాకు చోటు దక్కకపోతే ఆ పని చేస్తా.. శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Apr 27 , 2024 | 03:58 PM

టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) కోసం జట్టుని ప్రకటించే సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో.. ఎవరెవరిని ఎంపిక చేస్తారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. క్రీడాభిమానులకే కాదు, ఆటగాళ్లు సైతం జట్టులో తమ చోటు ఉంటుందా? ఉండదా? అని ఉత్సుకతతో..

Shubman Gill: నాకు చోటు దక్కకపోతే ఆ పని చేస్తా.. శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Shubman Gill Talks About His Selection For T20 World Cup

టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) కోసం జట్టుని ప్రకటించే సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో.. ఎవరెవరిని ఎంపిక చేస్తారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. క్రీడాభిమానులకే కాదు, ఆటగాళ్లు సైతం జట్టులో తమ చోటు ఉంటుందా? ఉండదా? అని ఉత్సుకతతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే శుభ్‌మన్ గిల్ (Shubman Gill) తన ఎంపికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ తాను సెలక్ట్ కాకపోతే.. తప్పకుండా నిరుత్సాహానికి గురవుతానని పేర్కొన్నాడు.


బాబోయ్ ఇదేం మేనిఫెస్టో.. రగిలిపోతున్న వైసీపీ కేడర్!!

ఓ ఇంటర్వ్యూలో శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. ‘‘గతేడాది భారత్ తరఫున వన్డే వరల్డ్‌కప్ ఆడాను. దీంతో.. వరల్డ్‌కప్ ఆడాలనే కోరిక నాకు తీరింది. ఇక టీ20 వరల్డ్‌కప్‌లో కూడా ఆడితే, మరో కల తీరినట్లు అవుతుంది. గతేడాది ఐపీఎల్ సీజన్‌లో దాదాపు 900 పరుగులు చేశాను. నాకైతు జట్టులో చోటు దక్కుతుందనే నమ్మకం బలంగా ఉంది. ఒకవేళ నన్ను ఎంపిక చేయకపోతే.. నిరుత్సాహానికి గురవుతా. నేనే కాదు, ఎవరినీ ఎంపిక చేయకపోతే బాధపడతారు. అయితే.. నాకు జట్టులో చోటు దక్కకపోయినా భారత్ విజయం సాధించాలని కోరుకుంటాను. ప్రతి ఆటగాడికీ మద్దుతు తెలుపుతా’’ అని చెప్పుకొచ్చాడు.

నాలుగేళ్ల తర్వాత ఇంటికొచ్చిన భర్త.. తమ్ముడితో భార్యను అలా చూసేసరికి..

కాగా.. టీ20 వరల్డ్‌కప్‌లో ఓపెనర్లుగా రోహిత్ శర్మ (Rohit Sharma), యశస్వీ జైస్వాల్ (Yashaswi Jaiswal) దాదాపు ఫిక్స్ అయ్యారని వార్తలు అందుతున్నాయి. ఈ తరుణంలోనే.. శుభ్‌మన్ గిల్ స్థానంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఐపీఎల్ సీజన్‌లో అతడు కన్సిస్టంట్‌గా ఆడకపోవడం వల్ల, జట్టులో స్థానం దక్కకపోవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే శుభ్‌మన్ గిల్ పైవిధంగా స్పందించాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన శుభ్‌మన్.. 304 పరుగులు చేశాడు. మరి.. అతనికి టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కుతుందా? లేదా? అనేది వేచి చూడాలి.

Read Latest Sports News and Telugu News

Updated Date - Apr 27 , 2024 | 04:35 PM