Share News

PV Sindhu: తెలుగు తేజం పీవీ సింధుకు నిరాశ.. 3 గేమ్‌ల తర్వాత

ABN , Publish Date - May 26 , 2024 | 03:21 PM

చాలా రోజుల నుంచి టైటిల్ కోసం ఎదురుచూస్తున్న పీవీ సింధుకు(PV Sindhu) మళ్లీ నిరాశ ఎదురైంది. మలేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్(Malaysia Masters 2024) మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు ఓడిపోయింది. మరోవైపు రాబోయే పారిస్ ఒలింపిక్స్‌కు(paris olympics 2024) ముందే ఓటమి పాలవ్వడం ఆమెను మరింత ఒత్తడిలోకి నెట్టింది.

PV Sindhu: తెలుగు తేజం పీవీ సింధుకు నిరాశ.. 3 గేమ్‌ల తర్వాత
PV Sindhu lost by Wang Zhiyi

చాలా రోజుల నుంచి టైటిల్ కోసం ఎదురుచూస్తున్న పీవీ సింధుకు(PV Sindhu) మళ్లీ నిరాశ ఎదురైంది. మలేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్(Malaysia Masters 2024) మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు ఓడిపోయింది. కౌలాలంపూర్‌లో ఆదివారం ప్రపంచ ర్యాంకింగ్స్‌ 15లో ఉన్న పీవీ సింధు.. చైనాకు చెందిన ప్రపంచ 7వ ర్యాంకర్ వాంగ్ జీ యితో(Wang Zhiyi) జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 21-16, 5-21, 16-21 తేడాతో ఓటమిపాలైంది.

ఐదో సీడ్ సింధు తొలి గేమ్‌ను గెలుచుకోగా, రెండో గేమ్‌ను వాంగ్‌జీ యి చేజిక్కించుకుంది. దాదాపు 1 గంట 18 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో చివరి, నిర్ణయాత్మక గేమ్‌లో సింధు తన ప్రత్యర్థికి గట్టిపోటీని అందించినప్పటికీ చివరికి ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.


గతేడాది అక్టోబర్‌లో మోకాలి గాయం నుంచి కోలుకుని ఒలింపిక్స్‌లో రజతం, కాంస్య పతకాలు సాధించిన సింధు(Sindhu) మునుపటిలా రాణించకపోవడంతో పాటు చాలా దగ్గరి మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. తొలి గేమ్ గెలిచినా చివరకు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. చివరిసారిగా పీవీ సింధు 2022 సింగపూర్ ఓపెన్‌లో టైటిల్ ను గెలుచుకుంది. అప్పటి నుంచి ఆమె టైటిల్ కోసం వేచిచూస్తోంది. BWF వరల్డ్ టూర్ సూపర్ 500 టోర్నమెంట్‌లో సింధు కెరీర్‌లో ఇది నాలుగో ఫైనల్ మ్యాచ్.


15వ సీడ్ పీవీ సింధుకు రాబోయే పారిస్ ఒలింపిక్స్‌కు(paris olympics 2024) ముందు ఆమె ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో ఈ విజయం చాలా కీలకమని చెప్పవచ్చు. జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరగనున్న పారిస్ ఒలింపిక్స్‌కు జర్మనీలో సన్నద్ధం కావడానికి సింధుకు ఇటీవల భారత క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. గత రెండు ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాలు సాధించడంలో ఆమె విజయవంతమైంది. ఈసారి కూడా ఆమెపై అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు.


ఇది కూడా చదవండి:

Neeraj Chopra: ఒలింపిక్స్‌కు ముందే షాక్.. నీరజ్ చోప్రాకు గాయంతో..

IPL 2024: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు వర్షం కురుస్తుందా.. వెదర్ రిపోర్ట్ ఏం చెబుతుంది

Read Latest Sports News and Telugu News

Updated Date - May 26 , 2024 | 03:26 PM