Share News

IPL 2024: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు వర్షం కురుస్తుందా.. వెదర్ రిపోర్ట్ ఏం చెబుతుంది

ABN , Publish Date - May 25 , 2024 | 03:28 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) సీజన్ 17 చివరకు దశకు వచ్చేసింది. ఈ సీజన్‌లో ట్రోఫీని కైవసం చేసుకునేందుకు కోల్‌కతా నైట్ రైడర్స్(KKR), సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) జట్లు రేపు (మే 26) తలపడనున్నాయి. అయితే చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచుకు వర్షం ముప్పు పొంచి ఉందా, ఉంటే ఎలా అనే విషయాలను ఇప్పుడు చుద్దాం.

 IPL 2024: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు వర్షం కురుస్తుందా.. వెదర్ రిపోర్ట్ ఏం చెబుతుంది
IPL 2024 final match rain chance

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) సీజన్ 17 చివరకు దశకు వచ్చేసింది. ఈ సీజన్‌లో ట్రోఫీని కైవసం చేసుకునేందుకు కోల్‌కతా నైట్ రైడర్స్(KKR), సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) జట్లు రేపు (మే 26న) తలపడనున్నాయి. KKR జట్టు తన మూడో టైటిల్‌ను గెలుచుకోవాలని చూస్తుండగా, హైదరాబాద్‌ తన రెండో టైటిల్‌ సాధించాలని పట్టుదలతో ఉంది. కానీ రేపు చెన్నైలోని ఎం.ఏ. చిదంబరం స్టేడియంలో రాత్రి 7. 30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుండగా..ఈ మ్యాచుకు వర్షం(rain) ముప్పు పొంచి ఉంది.


ఇప్పటికే బంగాళాఖాతంలో రెమాల్ తుపాను ఏర్పడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో చెన్నై(chennai)లో ఉష్ణోగ్రతలు మారవచ్చని, ఆకాశం మేఘావృతమై వర్షం కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడితే మ్యాచ్‌లో అదనంగా 120 గంటల సమయం ఇస్తారు. అయినప్పటికీ వర్షం తగ్గకపోతే మరుసటి రోజు అంటే రిజర్వ్ డే రోజున మ్యాచ్ జరుగుతుంది. అయితే రెండు రోజుల్లో వర్షం పడితే పాయింట్ల పట్టిక ఆధారంగా కోల్‌కతా నైట్ రైడర్స్ ట్రోఫీని కైవసం చేసుకుంటుంది.


ఇక చెన్నై పిచ్‌ విషయానికి వస్తే ఇది ప్రధానంగా బౌలింగ్‌‌కు చాలా అనుకూలంగా ఉంది. ఈ పిచ్‌పై ముఖ్యంగా స్పిన్నర్లకు మేలు జరుగుతుంది. గత రికార్డు గురించి చెప్పాలంటే ఎంఏ చిదంబరం స్టేడియంలో మొత్తం 84 ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగగా, అందులో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 49 మ్యాచ్‌ల్లో గెలుపొందగా, రెండో స్థానంలో బ్యాటింగ్ చేసిన జట్టు 35 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.


ఇది కూడా చదవండి:

Bank Holidays: జూన్ 2024లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులో తెలుసా..ఈసారి ఏకంగా.

Mileage Tips: పెట్రోల్, డీజిల్ ఎంత పోయించుకుంటే బెటర్.. ఫుల్ ట్యాంక్ లేదా లీటర్

Read Latest Sports News and Telugu News

Updated Date - May 25 , 2024 | 03:47 PM