Share News

MS Dhoni: ధోనీ హ్యాట్రిక్ సిక్సుల మోత.. మైదానంలో నేహా ధూపియా కేరింత

ABN , Publish Date - Apr 15 , 2024 | 07:06 PM

చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కేవలం మైదానంలో అడుగుపెడితేనే.. స్టేడియం మొత్తం అభిమానుల కేరింతలతో హోరెత్తిపోతుంది. అలాంటి ధోనీ ఇక బౌండరీలు బాదితే.. పరిస్థితి ఎలా ఉంటుందో మీరే అర్థం చేసుకోండి! చెవులు మోత మోగిపోయేలా అరుపులు అరుస్తారు.

MS Dhoni: ధోనీ హ్యాట్రిక్ సిక్సుల మోత.. మైదానంలో నేహా ధూపియా కేరింత

చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) కేవలం మైదానంలో అడుగుపెడితేనే.. స్టేడియం మొత్తం అభిమానుల కేరింతలతో హోరెత్తిపోతుంది. అలాంటి ధోనీ ఇక బౌండరీలు బాదితే.. పరిస్థితి ఎలా ఉంటుందో మీరే అర్థం చేసుకోండి! చెవులు మోత మోగిపోయేలా అరుపులు అరుస్తారు. అభిమానులే కాదండోయ్.. సెలెబ్రిటీలు సైతం తమ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోలేక ఎగిరి గెంతులేస్తారు. సరిగ్గా అలాంటి పరిణామమే ముంబైలోని వాంఖడే స్టేడియంలో (Wankhade Stadium) చోటు చేసుకుంది. ధోనీ బాదిన హ్యాట్రిక్ సిక్సులతో స్టేడియం దద్దరిల్లిపోగా.. సినీ తారలూ కేకలు వేస్తూ ఎంజాయ్ చేశారు.

‘హార్దిక్ లాంటి కెప్టెన్‌ని చూడలేదు.. అతనిదంతా ఓ నటన’


ఏప్రిల్ 14న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో.. హార్దిక్ పాండ్యా వేసిన 20వ ఓవర్‌లో ఇంకా నాలుగు బంతులు మిగిలి ఉన్నప్పుడు ధోనీ బ్యాటింగ్ చేసేందుకు వచ్చాడు. వచ్చి రాగానే.. తొలి మూడు బంతులను అతను సిక్సులుగా మలిచాడు. దీంతో స్టేడియం మొత్తం ఫ్యాన్స్ అరుపులతో దద్దరిల్లింది. ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చిన బాలీవుడ్ నటి నేహా ధూపియా సైతం ధోనీ సిక్సులకు ఫిదా అయ్యి.. కేరింతలు పెడుతూ గెంతులేసింది. ఇందుకు సంబంధించిన వీడియోతో పాటు కొన్ని ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆమెతో పాటు ఆమె భర్త, సినీ నటులు జాన్ అబ్రహం, కరీనా కపూర్‌లు సైతం ఈ మ్యాచ్ చూసేందుకు వెళ్లారు. నిజానికి.. వీళ్లందరూ ముంబైకి మద్దతు ఇవ్వడం కోసం మైదానానికి వెళ్లారు. కానీ.. ధోనీ బాదిన సిక్సులకు మంత్రముగ్ధులై, ఎంతో బాగా ఎంజాయ్ చేశామని తమ భావనల్ని పంచుకున్నారు.

చరిత్ర సృష్టించిన ధోనీ.. ఆ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. రుతురాజ్ (69), శివమ్ దూబే (66) రప్ఫాడించడంతో పాటు చివర్లో ధోనీ (4 బంతుల్లో 20) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో.. సీఎస్కే జట్టు అంత భారీ స్కోరు చేసింది. ఇక 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు.. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులకే పరిమితం అయ్యింది. దీంతో.. 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ముంబై బ్యాటర్లలో రోహిత్ శర్మ (53 బంతుల్లో 105) సెంచరీతో చెలరేగినా, ఇతర బ్యాటర్లు చేతులెత్తేయడంతో ముంబైకి ఓటమి తప్పలేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 15 , 2024 | 07:06 PM