Share News

MS Dhoni: ‘ధోనీ మూడు సిక్సులు కొడితే ఏంటి.. వాటితో విసుగెత్తిపోయా’

ABN , Publish Date - Apr 15 , 2024 | 04:19 PM

ఐపీఎల్-2024లో భాగంగా.. ఆదివారం ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ ఎలా చెలరేగి ఆడాడో అందరికీ తెలుసు. చివరి ఓవర్‌లో మూడు సిక్స్‌లు బాది.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోసారి తానొక గొప్ప ఫినిషర్‌ని అని నిరూపించుకున్నాడు.

MS Dhoni: ‘ధోనీ మూడు సిక్సులు కొడితే ఏంటి.. వాటితో విసుగెత్తిపోయా’

ఐపీఎల్-2024లో (IPL 2024) భాగంగా.. ఆదివారం ముంబై ఇండియన్స్ (Mumbai Indians), చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) మధ్య జరిగిన మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) ఎలా చెలరేగి ఆడాడో అందరికీ తెలుసు. చివరి ఓవర్‌లో మూడు సిక్స్‌లు బాది.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోసారి తానొక గొప్ప ఫినిషర్‌ని అని నిరూపించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే.. అతనిపై సర్వత్రా ప్రశంసలు వచ్చిపడుతున్నాయి. కానీ.. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ (Kieron Pollard) మాత్రం భిన్నంగా స్పందించాడు. ఆఖరి ఓవర్‌లో ఎవరైనా హిట్టింగ్ చేయడం సహజమేనని, అదేం గొప్ప విషయమేమీ కాదని కుండబద్దలు కొట్టాడు.

Hardik Pandya: చెత్త కెప్టెన్సీ.. చెత్త బౌలింగ్.. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై దారుణ ట్రోలింగ్!


‘‘అవును.. ధోనీ మూడు సిక్సులు బాదాడు. చివరి ఓవర్‌లో అతడు 20 పరుగులు తీశాడు. అయితే.. ఆఖరి ఓవర్‌లో ఎవరైనా 20 పరుగులు సాధించగలరు. అందులో వింతేముంది?’’ అని పొలార్డ్ పేర్కొన్నాడు. ధోనీ చాలాకాలం నుంచి వరల్డ్‌క్లాస్ క్రికెటర్‌గా కొనసాగుతున్నాడని, అలాంటి వ్యక్తి ఇటువంటి మెరుపు ఇన్నింగ్స్ ఆడటంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదని అభిప్రాయపడ్డాడు. ధోనీ మైదానంలో అడుగుపెట్టి షాట్లు బాదుతుంటే.. అది చూసేందుకు తాము కూడా ఇష్టపడతామని అన్నాడు. అయితే.. ధోనీని పెవిలియన్‌కు పంపించేందుకు తాము కొన్ని వ్యూహాలు రచించామని, అవి ఫలితాన్ని ఇవ్వలేదని చెప్పాడు. తమ ప్రణాళికల్ని తాము సరిగ్గా అమలు చేయలేకపోయామని చెప్పుకొచ్చాడు.

IPL 2024: హ్యాట్రిక్ సిక్సులు బాదిన ధోని.. అభిమానుల కేరింతలతో హోరెత్తిన స్టేడియం

ఇదే సమయంలో.. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై (Hardik Pandya) వస్తున్న విమర్శలపై కూడా పొలార్డ్ రియాక్ట్ అయ్యాడు. క్రికెట్ అనేది ఒక టీమ్ గేమ్ అని, వ్యక్తిగతంగా ఆటగాళ్లను టార్గెట్ చేయడం ఏమాత్రం సరికాదని చెప్పాడు. తన ఆటను మెరుగుపరచుకునేందుకు అతను ఎంతో కష్టపడుతున్నాడని తెలిపాడు. హార్దిక్ ఆత్మవిశ్వాసంపై ‘విమర్శలు’ ప్రభావితం చేస్తాయో లేవో తెలీదు కానీ.. అతడు చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటాడన్నాడు. హార్దిక్‌పై వస్తున్న విమర్శలతో తాను విసుగెత్తిపోయానని, అతనిలో ఉత్సాహం నింపేందుకు తామంతా ఒక జట్టుగా ప్రోత్సాహిస్తున్నామని, అతడు బాగా ఆడాలని బలంగా కోరుకుంటున్నామని పొలార్డ్ చెప్పుకొచ్చాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 15 , 2024 | 04:40 PM