Share News

MS Dhoni: హ్యాట్రిక్ సిక్స్‌లతో చెలరేగిన ధోనీ.. డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళుతూ ధోనీ చేసిన పనికి హ్యాట్సాఫ్!

ABN , Publish Date - Apr 15 , 2024 | 11:16 AM

చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇదే ధోనీ చివరి ఐపీఎల్ అని అభిమానులు మానసికంగా సిద్ధపడిన వేళ ఎక్కడికి వెళ్లినా అతడికి బ్రహ్మరథం పడుతున్నారు. పొడవాటి హెయిర్‌స్టైల్‌తో తన కెరీర్ తొలి నాళ్లను గుర్తు చేస్తున్న ధోనీ అదే ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు.

MS Dhoni: హ్యాట్రిక్ సిక్స్‌లతో చెలరేగిన ధోనీ.. డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళుతూ ధోనీ చేసిన పనికి హ్యాట్సాఫ్!
ధోనీ

చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇదే ధోనీ చివరి ఐపీఎల్ అని అభిమానులు మానసికంగా సిద్ధపడిన వేళ ఎక్కడికి వెళ్లినా అతడికి బ్రహ్మరథం పడుతున్నారు. పొడవాటి హెయిర్‌స్టైల్‌తో తన కెరీర్ తొలి నాళ్లను గుర్తు చేస్తున్న ధోనీ అదే ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. ఆదివారం వాంఖడే స్టేడియంలో ముంబ్ ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది (MI vs CSK). ఈ మ్యాచ్‌లో ధోనీ చెలరేగాడు (IPL 2024).


చెన్నై తరపున 20వ ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని.. హార్దిక్ పాండ్యా (Hardik Pandya) బౌలింగ్‌లో వరుసగా మూడు సిక్సర్లు కొట్టి అభిమానులను ఉర్రూతలూగించాడు. 4 బంతుల్లో 20 పరుగులు చేసి డ్రెస్సింగ్ రూమ్ వైపు పరుగెత్తాడు. డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లేందుకు మెట్లు ఎక్కుతుండగా బాల్ కనిపించింది. వెంటనే ఆ బాల్‌ను తీసి మైదానంలో ఉన్న ఓ చిన్నారికి బహుమతిగా అందించాడు. ధోనీ చేసిన పనిని చాలా మంది మెచ్చుకుంటున్నారు. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఇక, వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 206 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (69), శివమ్ దూబే (66 నాటౌట్) రాణించారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ముంబైని గెలిపించేందుకు రోహిత్ శర్మ చివరి వరకు పోరాటం చేశాడు. 105 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిగతా బ్యాట్స్‌మెన్ పెద్దగా రాణించకపోవడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 186 పరుగులు మాత్రమే చేసి 20 రన్స్ తేడాతో ఓడిపోయింది.

ఇవి కూడా చదవండి..

IPL 2024: కళ్లు చెదిరే క్యాచ్ అంటే ఇదీ.. గాల్లో అద్భుత విన్యానం చేసిన కేకేఆర్ ఆటగాడు రమణ్ దీప్ సింగ్!


IPL 2024: నేడు RCB vs SRH కీలక మ్యాచ్.. ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటే


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 15 , 2024 | 11:16 AM