Share News

Hardik Pandya: ‘హార్దిక్ లాంటి కెప్టెన్‌ని చూడలేదు.. అతనిదంతా ఓ నటన’

ABN , Publish Date - Apr 15 , 2024 | 05:14 PM

ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ స్థానంలో వచ్చినప్పటి నుంచే హార్దిక్ పాండ్యాపై విమర్శలు వస్తున్నాయి. మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారి అతనికి అవమానాలే ఎదురవుతున్నాయి. ఇక కెప్టెన్‌గా జట్టుని సమర్థవంతంగా నడిపించడంలో విఫలమవుతుండటంతో.. ఆ విమర్శలు మరింత పెరిగాయి.

Hardik Pandya: ‘హార్దిక్ లాంటి కెప్టెన్‌ని చూడలేదు.. అతనిదంతా ఓ నటన’
Hardik Pandya Acting Like He Is Happy

ముంబై ఇండియన్స్ (Mumbai Indians) కెప్టెన్‌గా రోహిత్ శర్మ (Rohit Sharma) స్థానంలో వచ్చినప్పటి నుంచే హార్దిక్ పాండ్యాపై (Hardik Pandya) విమర్శలు వస్తున్నాయి. మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారి అతనికి అవమానాలే ఎదురవుతున్నాయి. ఇక కెప్టెన్‌గా జట్టుని సమర్థవంతంగా నడిపించడంలో విఫలమవుతుండటంతో.. ఆ విమర్శలు మరింత పెరిగాయి. మరీ ముఖ్యంగా.. ఆదివారం (14/04/24) చెన్నై సూపర్ కింగ్స్‌తో (Chennai Super Kings) జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్‌గా, ఆటగాడిగా ఫెయిల్ అవ్వడంతో.. ప్రతి ఒక్కరూ అతడ్ని టార్గెట్ చేస్తున్నారు. చెత్త ఆట, చెత్త కెప్టెన్సీ అంటూ అతడ్ని దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అతనికి మద్దతుగా సీనియర్లు దిగొస్తున్నారు.

ఓటర్లకు అవగాహన కల్పించే ‘పెళ్లి కార్డు’.. ఎనిమిదో అడుగు వేయాలంటూ..


తాజాగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ (Kevin Peterson) సైతం హార్దిక్‌కి అండగా నిలిచాడు. అతని నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే.. హార్దిక్‌ని ఎగతాళి చేయొద్దని అభిమానుల్ని విజ్ఞప్తి చేశాడు. తొలుత హార్దిక్ కెప్టెన్సీ గురించి మాట్లాడుతూ.. ‘‘సీఎస్‌కేతో మ్యాచ్‌లో అతని వ్యూహాలేమిటో అర్థం కాలేదు. మ్యాచ్‌ ప్రారంభానికి ఐదు గంటల ముందు ప్లాన్ ‘ఏ’ సిద్ధం చేసుకుంటే.. మైదానంలో దిగిన తర్వాత పరిస్థితికి తగినట్లు ప్లాన్ ‘బీ’ని సైతం రెడీ చేసుకొని ముందుకు వెళ్లాలి. కానీ.. హార్దిక్ నుంచి అలాంటి వ్యూహం కనిపించలేదు. సీమర్స్ 20కి పైగా పరుగులు ఇస్తున్నప్పుడు.. స్పిన్నర్స్‌ని బరిలోకి దింపని కెప్టెన్ ఎవరైనా ఉంటారా? కామెంటరీ సమయంలో బ్రియాన్ లారా సైతం ‘స్పిన్నర్స్‌ని దింపితే బాగుంటుందని చెప్పారు. ముంబై వద్ద మంచి స్పిన్నర్లు ఉన్నారు. పరిస్థితికి తగ్గట్టు ఆట వేగాన్ని మార్చాల్సి ఉంటుంది’’ అని అభిప్రాయపడ్డాడు.

‘ధోనీ మూడు సిక్సులు కొడితే ఏంటి.. వాటితో విసుగెత్తిపోయా’

అనంతరం హార్దిక్‌పై వస్తున్న విమర్శల గురించి పీటర్సన్ స్పందిస్తూ.. ప్రేక్షకుల ఆగ్రహం కూడా ఈ ఇండియన్ ఆల్‌రౌండర్‌పై తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయని అన్నాడు. హార్దిక్ సంతోషంగా ఉన్నట్టు నటిస్తున్నాడని, నిజానికి అతడు ఏమాత్రం సంతోషంగా లేడని తెలిపాడు. అతడు కూడా మనిషేనని, దయచేసి అతడ్ని గేళి చేయొద్దని అభిమానుల్ని కోరాడు. టాస్ సమయంలో హార్దిక్ మరీ ఎక్కువగా స్మైల్ ఇస్తున్నాడని.. కానీ తాను సంతోషంగా ఉన్నానని చెప్పేందుకు అలా నటిస్తున్నాడని పేర్కొన్నాడు. హోం గ్రౌండ్‌లోనే హార్దిక్‌కి అవమానం ఎదురైందని.. ఇలా చేస్తే ఎవరినైనా బాధిస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు. భారత ప్రధాన ఆటగాళ్లలో హార్దిక్ ఒకడని, అతని పట్ల ఇలా వ్యవహరించడం ఏమాత్రం సరికాదని పీటర్సన్ చెప్పుకొచ్చాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 15 , 2024 | 05:27 PM