Share News

Viral Video: దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్ గెలిచాక మనోళ్ల రియాక్షన్స్ చూశారా?

ABN , Publish Date - Jan 05 , 2024 | 03:15 PM

Viral Video: కేప్ టౌన్ టెస్టులో టీమిండియా గెలిచిన తర్వాత డ్రెస్సింగ్ రూంలో ఉత్కంఠగా మ్యాచ్ వీక్షిస్తున్న కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను విరాట్ కోహ్లీ కౌగిలించుకోవడం కెమెరాలకు చిక్కింది. అటు గిల్, జైశ్వాల్ కూడా విన్నింగ్ షాట్ కోసం ఎదురుచూస్తున్న హావభావాలను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది

Viral Video: దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్ గెలిచాక మనోళ్ల రియాక్షన్స్ చూశారా?

దక్షిణాఫ్రికా పర్యటనను టీమిండియా సంతృప్తికరంగా ముగించింది. తొలుత మూడు టీ20ల సిరీస్‌ను 1-1తో సమం చేసిన టీమిండియా.. మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇక రెండు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసి టీమిండియా స్వదేశానికి బయలుదేరింది. రికార్డు స్థాయిలో రెండో టెస్టు కేవలం ఒకటిన్నర రోజులోనే ముగిసింది. పేసర్లకు దాసోహం అన్న కేప్‌టౌన్ పిచ్‌ బ్యాటర్లకు మాత్రం చుక్కలు చూపించింది. ఈ టెస్టులో 79 పరుగుల విజయలక్ష్యాన్ని 7 వికెట్ల తేడాతో ఛేదించి కేప్‌టౌన్‌లో టీమిండియా తొలి విజయాన్ని అందుకుంది. ఆసియా నుంచి కేప్‌టౌన్‌లో గెలిచిన తొలి జట్టుగా నిలిచింది. మొత్తమ్మీద దక్షిణాఫ్రికా గడ్డపై టీమిండియాకు ఇది ఐదో టెస్టు విజయం మాత్రమే.

కాగా విజయానికి 79 పరుగులు అవసరం కాగా జైశ్వాల్, గిల్, కోహ్లీ పెవిలియన్ బాట పట్టారు. ఈ పరిస్థితుల్లో మార్కో యాన్‌సన్ వేసిన బంతిని శ్రేయాస్ అయ్యర్ మిడాన్‌లో బౌండరీకి తరలించి భారత్‌కు విజయం అందించాడు. టీమిండియా గెలిచిన తర్వాత డ్రెస్సింగ్ రూంలో ఉత్కంఠగా మ్యాచ్ వీక్షిస్తున్న కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను విరాట్ కోహ్లీ కౌగిలించుకోవడం కెమెరాలకు చిక్కింది. అటు గిల్, జైశ్వాల్ కూడా విన్నింగ్ షాట్ కోసం ఎదురుచూస్తున్న హావభావాలను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయ్యర్ విన్నింగ్ షాట్ కొట్టగానే కమాన్ కమాన్ అంటూ వాళ్లిద్దరూ గట్టిగా అరవడం వీడియోలో కనిపించింది. అటు న్యూలాండ్స్ మైదానంలో విజయం కొత్త ఏడాదిలో భారత్‌కు తొలి విజయం అని బీసీసీఐ తన పోస్టులో పేర్కొంది.


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 05 , 2024 | 03:15 PM