Share News

Sunil Narine: సునీల్ నరైన్ అరుదైన ఘనత.. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఏకైక ఆటగాడు

ABN , Publish Date - May 27 , 2024 | 10:55 AM

కేకేఆర్‌ ఆల్‌రౌండర్‌ సునీల్‌ నరైన్‌ ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. 17 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో మూడుసార్లు అత్యంత విలువైన ఆటగాడి అవార్డు అందుకున్నాడు. ఐపీఎల్‌లో ఈ ఫీట్ సాధించిన...

Sunil Narine: సునీల్ నరైన్ అరుదైన ఘనత.. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఏకైక ఆటగాడు

కేకేఆర్‌ (KKR) ఆల్‌రౌండర్‌ సునీల్‌ నరైన్‌ (Sunil Narine) ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. 17 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో మూడుసార్లు అత్యంత విలువైన ఆటగాడి అవార్డు (Most Valuable Player) అందుకున్నాడు. ఐపీఎల్‌లో ఈ ఫీట్ సాధించిన ఏకైక ఆటగాడు ఇతడే! తొలుత తన డెబ్యూ సీజన్ 2012లో ఈ అవార్డ్ అందుకున్న నరైన్.. ఆ తర్వాత 2018లో, ఇప్పుడు 2024లో అత్యంత విలువైన ఆటగాడి అవార్డును సొంతం చేసుకున్నాడు.


టీమిండియా హెచ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్.. ఫోటో చెప్పిన సాక్ష్యం?

2012 సీజన్‌లో 24 వికెట్లు పడగొట్టి.. కేకేఆర్ విజయాల్లో నరైన్ అత్యంత కీలక పాత్ర పోషించాడు. 2018 సీజన్‌లో 357 పరుగులు చేసి తన బ్యాటింగ్ ప్రతిభను చాటాడు. ఇక 2024 సీజన్‌లో అయితే ఆల్‌రౌండ్ ప్రదర్శనతో దుమ్ముదులిపేశాడు. మెంటార్ గౌతమ్ గంభీర్ చొరవతో ఓపెనర్‌గా రంగంలోకి దిగిన నరైన్.. 488 పరుగులు చేసి, ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచాడు. అలాగే.. 17 వికెట్లు పడగొట్టి, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 11వ స్థానంలో నిలిచాడు. అందుకే.. అతనికి అత్యంత విలువైన ఆటగాడి అవార్డ్ దక్కింది.

ఆ రెండు తప్పిదాలే సన్‌రైజర్స్ హైదరాబాద్ కొంపముంచాయా?

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన్ సన్‌రైజర్స్ జట్టు 18.3 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌట్ అయ్యింది. బ్యాటర్లందరూ చేతులెత్తేయడం వల్లే అంత తక్కువ స్కోరుకే హైదరాబాద్ జట్టు చాపచుట్టేయాల్సి వచ్చింది. అనంతరం బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. కేవలం 10.3 ఓవర్లలోనే రెండు వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని (114) ఛేధించి, సన్‌రైజర్స్‌ని చిత్తుగా ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. కేకేఆర్‌కు ఐపీఎల్‌లో ఇది మూడో టైటిల్. ఇంతకుముందు 2012, 2014 సీజన్లలోనూ ఇది ఐపీఎల్ టైటిల్స్‌ని సొంతం చేసుకుంది.

Read Latest Sports News and Telugu News

Updated Date - May 27 , 2024 | 10:55 AM